https://oktelugu.com/

Rock Salt : రాళ్ల ఉప్పును పర్సులో పెట్టుకుంటే మీకు కనకవర్షమే

ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే పర్సులో రాళ్లఉప్పును పేపర్లో మడతపెట్టి పెట్టుకోవాలి. దీంతో భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. వారానికి ఒకసారి బాత్రూంలో ఉప్పును మారుస్తూ ఉంటే మంచిది. రోజు వాడే వాహనాలను ఉప్పుతో కడిగితే నెగెటివ్ ఎనర్జీ పోతుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : June 25, 2023 / 03:04 PM IST
    Follow us on

    Rock Salt : అందరి ఇళ్లల్లోనూ సమస్యలు ఉండే ఉంటాయి. కొందరి ఇళ్లల్లో చిన్న సమస్యలు మరికొందరి ఇళ్లలో పెద్ద సమస్యలు ఉంటాయి. సమస్యలు మాత్రం కామన్. కష్టాలు మనుషులకే వస్తాయి కానీ చెట్లు చేమలకు రావు కదా. మనం ఆలోచించే స్థితిని బట్టి సమస్య చిన్నదా పెద్దదా అని ఆలోచిస్తుంటాం. ఆర్థిక సమస్యలైతే కామన్. ఈ రోజుల్లో ఎంత సంపాదించినా డబ్బు నిలవడం లేదని అంటారు. కానీ ఖర్చులు పెరిగాయని గుర్తించరు. మ సంపాదన పెరిగితేనే ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. అంతేకాని సంపద పెరగకుండా ఖర్చులు పెరుగుతున్నాయనుకోవడం అమాయకత్వమే.

    ఆర్థిక సమస్యల నుంచి..

    చాలా మంది తమకు ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయంటే ఇంట్లో ఏదో వాస్తు లోపం ఉందని భావిస్తుంటారు. ఆ దిశగానే ఆలోచనలు చేస్తుంటారు. కానీ ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలని ఆలోచనలో పడిపోతారు. ఇంటికి దిష్టి ఉంటే కూడా ఆర్థికంగా నిలదొక్కుకోలేమని అనుకుంటారు. ఇందుకోసం ఓ చక్కని చిట్కా ఉంది. అది సులభతరమైనదే. ఇంట్లో దిష్టి పోవాలంటే రాళ్ల ఉప్పును వాడుకుంటే మంచి ఫలితం వస్తుంది.

    పాజిటివ్ ఎనర్జీ కోసం..

    కంటి దిష్టి పోవాలంటే రాళ్ల ఉప్పు దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది. ఒక గాజు సీసాలో వంటకు ఉపయోగించే రాళ్ల ఉప్పుని వేయండి. దాన్ని బాత్రూంలో పెట్టండి. నీళ్లు పడకుండా చూసుకోవాలి. ఇలా రాళ్ల ఉప్పు పెడితే సమస్యలు తొలగిపోతాయి. స్నానం చేసేటప్పుడు చిటికెడు పసుపు ఒక టీ స్పూన్ రాళ్ల ఉప్పును కలిపి స్నానం చేస్తే ప్రతికూల శక్తులు పోతాయి. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. రాళ్ల ఉప్పుతో మనకు చాలా రకాల లాభాలు కలుగుతున్నాయి.

    రాళ్ల ఉప్పును పేపర్ లో..

    ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే పర్సులో రాళ్లఉప్పును పేపర్లో మడతపెట్టి పెట్టుకోవాలి. దీంతో భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. వారానికి ఒకసారి బాత్రూంలో ఉప్పును మారుస్తూ ఉంటే మంచిది. రోజు వాడే వాహనాలను ఉప్పుతో కడిగితే నెగెటివ్ ఎనర్జీ పోతుంది. రాళ్ల ఉప్పుతో మనకు ఇన్ని రకాల ప్రయోజనాలు ఉండటంతో దీన్ని వాడుకుని మన ప్రతికూల ప్రభావాలు దూరం చేసుకుంటే మంచిది. పాజిటివ్ ఎనర్జీ రావడానికి జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే.