https://oktelugu.com/

Good Sleep : సుఖంగా నిద్రపట్టాలంటే ఈ సింపుల్ చిట్కాలు పాటించండి

ఎడమవైపు గుండె ఉంటుంది. గురుత్వాకర్షణతో రక్తం సులభంగా గుండెకు సరఫరా అవుతుంది. దీంతో గుండెపై ఒత్తిడి తగ్గి గుండె ఆరోగ్యం బాగుంటుంది.

Written By:
  • BS
  • , Updated On : June 25, 2023 / 02:53 PM IST
    Follow us on

    Good Sleep : ఉరుకులు, పరుగుల జీవితాల్లో పడి కంటి నిండా నిద్ర కూడా చాలా మందికి పట్టడం లేదు. ఎప్పుడు తింటున్నారో, ఎప్పుడు నిద్ర పోతున్నారో కూడా చాలా మందికి తెలియనంతగా బిజీగా మారిపోయారు. జీవితంలో ఎన్ని ఉన్నా ప్రశాంతమైన నిద్ర లేకపోతే.. అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే అంటారు కోట్ల రూపాయలు వెచ్చించి పరుపు కొనుక్కోగలం గానీ.. కంటి నిండా సుఖమైన నిద్రను మాత్రం కొనుక్కోలేమని. అయితే, అటువంటి సుఖమైన నిద్రకు కొన్ని పద్ధతులు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అటువంటి పద్ధతులను అనుసరించడం ద్వారా ప్రశాంతమైన నిద్రను పొందవచ్చని సూచిస్తున్నారు.

    ప్రశాంతమైన నిద్రకు కొన్ని భంగిమలు కూడా దోహదం చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇందుకోసం శాస్త్రీయమైనటువంటి ఆధారాలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. కొన్నిసార్లు మానసికంగా ప్రశాంతంగా ఉన్నప్పటికీ కునుకు మాత్రం పడదు. దీనికి నిద్ర భంగిమలు కూడా సమస్యగా ఉంటాయని చెబుతున్నారు. నిద్రపోయేటప్పుడు సరైన భంగిమలు అనుసరించడం ద్వారా కంటి నిండా సరిపడా నిద్ర వస్తుందని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా రాత్రిపూట నిద్ర సరిగా ఉంటే ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు.
    ఎడమవైపు పడుకుంటే జీర్ణ వ్యవస్థ మెరుగు..
    పడుకునేటప్పుడు ఎడమవైపు తిరిగి నిద్రించడం ద్వారా జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. వ్యర్ధాలన్నీ కిందికి చేరుతాయి. పెద్ద పేగు ఖాళీ కావడంతోపాటు ఇతర సమస్యలు ఉత్పన్నం కాకుండా చేసేందుకు ఈ భంగిమ దాహం చేస్తుంది. అలాగే, ఈ మధ్య కాలంలో గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. గుండె బాగుండాలంటే ఎడమవైపు తిరిగి నిద్రించడం చాలా మంచిది. ఎందుకంటే ఎడమవైపు గుండె ఉంటుంది. గురుత్వాకర్షణతో రక్తం సులభంగా గుండెకు సరఫరా అవుతుంది. దీంతో గుండెపై ఒత్తిడి తగ్గి గుండె ఆరోగ్యం బాగుంటుంది.
    గర్భిణీలకు ఈ భంగిమ ఉపయుక్తం..
    అలాగే ఎడమవైపు పడుకోవడం ద్వారా గర్భిణులకు చాలా మేలు కలుగుతుందని చెబుతున్నారు. ఎడమవైపు తిరిగి నిద్రించడం ద్వారా చాలా సౌకర్యంగా ఉంటుందని పేర్కొంటున్నారు. గర్భిణీ కడుపులో ఉండే బిడ్డ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నిద్ర భంగం కూడా కలుగదు. గర్భిణీలు ఇలా పడుకోవడం వల్ల వెన్నుముక, నడుము పై ఒత్తిడి తగ్గుతుంది. గర్భాశయానికి, పిండానికి రక్తప్రసరణ బాగుంటుంది. బిడ్డకు పోషకాలు బాగా అందుతాయి.
    ఆయాసం సమస్య పూర్తిగా తగ్గుతుంది..
    కొన్నిసార్లు ఆహారం రుచిగా ఉంటే కాస్త ఎక్కువగానే తింటుంటారు. పడుకుంటే నిద్ర పట్టదు. ఆయాసం కూడా పెరుగుతుంది. ఇటువంటి సమయంలో ఓ పది నిమిషాలు పాటు ఎడమవైపు తిరిగి పడుకుంటే సమస్య పూర్తిగా తొలగిపోతుంది. అలాగే అధిక బరువు, సైనస్ సమస్య ఉంటే నిద్ర పోయినప్పుడు గురక పెడతారు. ఇది గుండెకు చేటు చేస్తుంది. ఇలాంటి సమస్య ఉన్నవాళ్లు వెల్లకిలా కాకుండా కుడి, ఎడమవైపు తిరిగి పడుకోవాలి. పాలిచ్చే తల్లులు గుండు పై చిన్నారులను వేసుకుని తాగించకూడదు. ఇది బిడ్డ ఆరోగ్యానికి కూడా హాని చేస్తుంది. పక్కకు తిరిగి పట్టడంతో బిడ్డ ముక్కులోకి పాలు పోకుండా ఉంటాయి.