https://oktelugu.com/

India first World Cup : భారత్ తొలి వరల్డ్ కప్ విజయానికి 40 ఏళ్లు.. అగ్రశ్రేణిజట్టుగా ఎలా ఎదిగింది?

1983 వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయిన తర్వాత ఇప్పటి వరకు ఫైనల్ కు చేరుకోకపోవడం గమనార్హం. ఆ వరల్డ్ కప్ తర్వాత నుంచి భారత జట్టు అగ్రశ్రేణిజట్టుగా ఎదిగింది. భారత జట్టు విజయం భారతను గొప్ప జట్టుగా తీర్చిదిద్దితే.. ఓటమి వెస్టిండీస్ జట్టును పతనావస్థలో పడిపోయేలా చేసింది.

Written By:
  • BS
  • , Updated On : June 25, 2023 3:09 pm
    Follow us on

    India first World Cup : భారత జట్టు తొలిసారి వన్డే వరల్డ్ కప్ గెలిచి సరిగ్గా 40 ఏళ్లు అవుతోంది. 1983లో కపిల్ దేవ్ నేతృత్వంలోని టీమిండియా అనూహ్య రీతిలో వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంది. ఆ టోర్నీలో అనా మక జట్టుగా బరిలోకి దిగిన భారత్ ఊహించని విధంగా మేటి జట్లను ఓడించి ఫైనల్ కు చేరింది. నాటి టోర్నీలో ఇంగ్లాండ్, జట్లు కూడా ఫైనల్ చేరడంలో చదికిలపడగా భారత్ మాత్రం ఫైనల్ కు చేరుకుని అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
    క్రికెట్ లో ఏ జట్టుకైనా వరల్డ్ కప్ సాధించడం కల. ఆ కలను భారత జట్టు 1983లో తొలిసారి తీర్చుకుంది. కపిల్ దేవ్ సారధ్యంలోని భారత జట్టు గొప్ప జట్లకు సైతం షాక్ కి ఇచ్చి నోకియా విజయాలతో ఫైనల్ కు చేరుకుంది. ఫైనల్ లో పటిష్టమైన వెస్టిండీస్ జట్టును ఓడించి అద్భుత విజయాన్ని నమోదు  చేసుకుని తొలిసారి వరల్డ్ కప్ ను ముద్దాడింది కపిల్ దేవ్ సేన. ఈ విజయంతో భారత జట్టు కూడా అగ్రశ్రేణి జట్ల జాబితాలో చేరిపోయింది.
    తేలిపోయిన భారత బ్యాటర్లు..
    ఫైనల్ మ్యాచ్ లో భయంకరమైన వెస్టిండీస్ జట్టుతో భారత్ తలపడాల్సి వచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా జట్టు ఆశించిన స్థాయిలో పరుగులు చేయలేకపోయింది. బ్యాటింగ్ లో ఏమాత్రం సీనియర్ ఆటగాళ్ళు రాణించలేదు. ఓపెనర్ క్రిష్ శ్రీకాంత్ (38), మహేందర్ అమర్నాథ్ (26), సందీప్ పాటిల్ (27) మాత్రమే రాణించడంతో నిర్ణీత ఓవర్లలో భారత జట్టు 183 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్వల్ప లక్ష్యమే కావడంతో వెస్టిండీస్ సులభంగా విజయం సాధిస్తుందని అంతా భావించారు. అయితే భారత బౌలర్ల అద్భుత పోరాటంతో మ్యాచ్ హోరాహోరీగా సాగింది.
    పరుగులు చేయలేక ఇబ్బంది పడిన వెస్టిండీస్ బ్యాటర్లు..
    స్వల్ప లక్ష్యమే అయినప్పటికీ భారత బౌలర్లు అద్భుత ప్రదర్శనతో వెస్టిండీస్ జట్టుకు పరుగులు చేయడం కష్టంగా మారింది. బ్యాటుతో రాణించిన మహేందర్ అమర్నాథ్ బౌలింగ్ లోను అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. రెండు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు తీయడంతో వెస్టిండీస్ జట్టు పై ఒత్తిడి పెరిగింది. అతనితోపాటు మదన్ లాల్ కూడా 31 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. దీంతో వెస్టిండీస్ పూర్తిగా ఒత్తిడిలో పడిపోయింది. ఒకానొక దశలో వెస్టిండీస్ ఘోరంగా ఓడిపోతుందనుకున్నారు. కానీ ఆ జట్టులోని లెజెండరీ బ్యాటర్ వివ్ రిచర్డ్స్ (33), జఫ్ డూయోన్ (25) రాణించడంతో విజయం దిశగా సాగింది. అయితే రిచర్డ్స్ ను కపిల్ దేవ్ అద్భుతమైన రన్నింగ్ క్యాచ్ తో పెవిలియన్ చేర్చాడు. దీంతో వెండి ఆశలు అడియాశలుగా మారాయి. మరో భారత బౌలర్ బల్విందర్ సందు రెండు వికెట్లతో ఆకట్టుకోగా, స్టువర్టు బిన్నీ, కపిల్ దేవ్ చెరో వికెట్ తీసుకున్నారు. దీంతో వెస్టిండీస్ జట్టు 140 పరుగులకే ఆల్ అవుట్ అయింది. అసలు విజయమే సాధించడం కష్టం అనుకున్న భారత జట్టు 43 పరుగుల తేడాతో ఘనవిజయం నమోదు చేసింది. ఈ విజయంతో భారత గట్టు తొలిసారి వన్డే వరల్డ్ కప్ సాధించినట్లు అయింది. అంతకుముందు రెండుసార్లు వన్డే వరల్డ్ కప్ సాధించిన వెస్టిండీస్ ఫైనల్లో ఓడించడంతో భారత జట్టు అగ్రశ్రేణి జట్లు జాబితాలో చేరిపోయింది. ఆ తర్వాత నుంచి వెస్టిండీస్ జట్టు పతనం కూడా ప్రారంభమైందని చెబుతుంటారు. భారత చేతిలో వెస్టిండీస్ జట్టు 1983 వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయిన తర్వాత ఇప్పటి వరకు ఫైనల్ కు చేరుకోకపోవడం గమనార్హం. ఆ వరల్డ్ కప్ తర్వాత నుంచి భారత జట్టు అగ్రశ్రేణిజట్టుగా ఎదిగింది. భారత జట్టు విజయం భారతను గొప్ప జట్టుగా తీర్చిదిద్దితే.. ఓటమి వెస్టిండీస్ జట్టును పతనావస్థలో పడిపోయేలా చేసింది.