Prabhas : తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు ప్రభాస్.. గత సంవత్సరం సలార్ సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్న ఆయన… ఈ సంవత్సరం రీసెంట్ గా కల్కి సినిమాతో వచ్చి 1000 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టింది. ఇక ఇప్పటికీ కూడా ఆ సినిమా ఇంకా థియేటర్ లో ప్రదర్శించబడుతుంది. ఇక ఇప్పుడున్న రోజుల్లో ఎంత పెద్ద తోపు సినిమా అయిన కూడా వారం రోజులకే పెట్టా బేడ సర్ధేస్తున్న సమయం లో కల్కి రిలీజ్ అయి దాదాపు 40 రోజుల నుంచి థియేటర్లో ప్రదర్శించడం అంటే మామూలు విషయం కాదు. ఇక అందులోనూ ఈ సినిమా ప్రభాస్ కి మరొక భారీ సక్సెస్ ను కట్టబెట్టిందనే చెప్పాలి. ఇక బాహుబలి తర్వాత ప్రభాస్ కెరియర్ లో 1000 కోట్ల కలెక్షన్లను వసూలు చేసిన సినిమా మరొకటి రాలేదు. ఇక సలార్ సినిమా సూపర్ సక్సెస్ అయినప్పటికీ ఆ సినిమాకు 800 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి… ఇక కల్కి సినిమా 50 రోజుల్లో కొంచెం అటు ఇటు గా 1200 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టింది. ఇక ప్రస్తుతం ప్రభాస్ ప్రశాంత్ నీల్ తో సలార్ 2 సినిమా చేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో హను రాఘవపూడి తో ఇండియన్ ఆర్మీ కి సంబంధించిన ఒక ప్రాజెక్టుని చేయబోతున్నాడు. ఇక దీనికి సంబంధించిన కథ చర్చలు మొత్తం పూర్తయినప్పటికీ తొందర్లోనే ఈ సినిమా కూడా సెట్స్ మీదకి వెళ్ళబోతుందంటూ వార్తలైతే వినిపిస్తున్నాయి.
ఇక ప్రభాస్ ఇప్పటి వరకు చాలా పాత్రల్లో చేసి నటించాడు. ఇక ఇప్పుడు హను రాఘవపూడి తో చేయబోయే సినిమాలో మొదటిసారి ఆయన ఆర్మీ ఆఫీసర్ గా నటించడమే కాకుండా ప్రేక్షకులతో పాటు తన అభిమానుల్లో కూడా భారీ అంచనాలను పెంచేస్తున్నాడు… ఇక మొత్తానికైతే ఆయన చేసిన ప్రతి క్యారెక్టర్ లో కూడా తను లీనమైపోయి నటిస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఆర్మీ ఆఫీసర్ క్యారెక్టర్ లో కూడా చాలా బాగా నటించి ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడం లో ఆయన కీలక పాత్ర పోషించబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఆయన పోషించే పాత్ర స్వాతంత్రం కోసం పోరాటం చేసిన ‘సుభాష్ చంద్రబోస్’ పాత్ర గా తెలుస్తుంది. మరి హను రాఘవ పూడి ఆ క్యారెక్టర్ ను యాజిటీజ్ గా చూపించే ప్రయత్నాలు చేస్తున్నాడా? లేదంటే సుభాష్ చంద్రబోస్ పాత్రను ఇన్స్పైర్ అయి ఈ పాత్రను రాసుకున్నాడా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టి వాటితో భారీ సక్సెస్ లను అందుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఇక బాలీవుడ్ హీరోలు ఎలాగో హిట్టు కొట్టలేకపోతున్నారు. కాబట్టి ప్రభాస్ వరుస సక్సెస్ లను అందుకొని బాలీవుడ్ జనాలని, తెలుగు ఆడియన్స్ ను కూడా విపరీతంగా అలరిస్తున్నాడనే చెప్పాలి.
ఇక ఈ సినిమా కూడా ఒక భారీ సక్సెస్ గా నిలవబోతోంది అనేది ఇప్పుడు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఇంతకుముందు హను రాఘవ పూడి ‘సీతా రామం’ సినిమాను కూడా ఆర్మీ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కించాడు. కాబట్టి ఆ సినిమా సూపర్ సక్సెస్ గా నిలిచింది. ఇక అదే లైన్ లో మళ్లీ ఈ సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఈ సినిమాను కూడా సూపర్ సక్సెస్ గా నిలపడమే తన టార్గెట్ గా తెలుస్తుంది…