https://oktelugu.com/

Health Tips : వీటిని పచ్చిగా తింటున్నారా.. అయితే మీరు డేంజర్‌లో పడినట్లే!

పచ్చిగా ఉండే పదార్థాలను తినడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. పచ్చిగా తినడం వల్ల తినే ఫుడ్ జీర్ణం కాదు. కొన్ని రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే పచ్చిగా తినకూడదని ఆహార పదార్థాలేంటి? వాటిని తినడం వల్ల కలిగే నష్టాలు ఏంటో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 5, 2024 / 09:32 PM IST

    Green vegetables

    Follow us on

    Health Tips :  పచ్చి కూరగాయలు ఆరోగ్యానికి మంచివే. వీటిని డైలీ తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతుంటారు. అయితే కూరగాయల్లో క్యారెట్, బీట్‌రూట్ ఇలా కొన్నింటిని పచ్చిగా తింటారు. వీటిని పచ్చిగా తిన్నా కూడా ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే కొన్ని రకాల పదార్థాలను మాత్రం అసలు పచ్చిగా తినకూడదు. అలా తినడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా ఫిట్‌నెస్ పాటించేవారు గుడ్లు, పాలు వంటి వాటిని పచ్చిగా తింటారు. తెలియక కొందరు పచ్చిగా ఉండే పదార్థాలను తినడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. పచ్చిగా తినడం వల్ల తినే ఫుడ్ జీర్ణం కాదు. కొన్ని రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే పచ్చిగా తినకూడదని ఆహార పదార్థాలేంటి? వాటిని తినడం వల్ల కలిగే నష్టాలు ఏంటో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

    బంగాళదుంపలు
    వీటిని పచ్చిగా తింటేనే ఆరోగ్యమని కొందరు తింటుంటారు. అయితే వీటిని పచ్చిగా తినడం వల్ల ఆరోగ్యానికి చెడు జరుగుతుంది. పచ్చి బంగాళ దుంప తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. అలాగే పచ్చి బంగాళ దుంపలో గ్లైకో ఆల్కలాయిడ్స్ ఉంటాయి. ఇవి శరీరానికి హాని కలిగించడంతో పాటు అలెర్జీలకు దారితీస్తుంది. వీటిని పచ్చిగా కంటే వండుకుని తినడమే బెటర్ అని నిపుణులు చెబుతున్నారు.

    చిక్కుడు కాయలు
    చిక్కుడు కాయలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో ఉండే పోషకాల వల్ల శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే వీటిని పచ్చిగా తినడం ఆరోగ్యానికి హానికరం. పచ్చిగా తినడం వల్ల కొన్నిసార్లు ఫుడ్ పాయిజన్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. వీటిని వండి తింటేనే ఆరోగ్యం. లేకపోతే జీర్ణ సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది.

    పచ్చి గుడ్లు, పాలు
    కొందరు జిమ్‌కు వెళ్లే వాళ్లు పచ్చి గుడ్లు, పాలను తింటారు. సాధారణంగా ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయని భావిస్తారు. కానీ పచ్చి గుడ్లు, పాలను తీసుకోవడం వల్ల కొన్నిసార్లు ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. వీటిని తింటే అనారోగ్య సమస్యల బారిన పడతారు. పాలను మరిగించకుండా తాగితే పాలలోని బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా జీర్ణ సమస్యలు, కడుపు సంబంధిత సమస్యలు, అలెర్జీ, చర్మ సమస్యలు కూడా వస్తాయి. గుడ్లు ఉడికించి తినడమే ఆరోగ్యానికి మంచిది. డైలీ ఉడికించి తింటేనే బలంగా ఉంటారు.

    మెలకలు
    మెలకెత్తిన గింజలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఇందులోని పోషకాలు అనారోగ్య సమస్యల బారిన పడకుండా చేస్తుంది. అయితే కొందరు వీటిని పచ్చిగానే తింటారు. ఇలా తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మెలకెత్తిన గింజలను వేడి చేయకుండా పచ్చిగా తింటే అందులోని పోషకాలు శరీరానికి అందవు. కాబట్టి స్టీమ్ చేసి లేదా ఉడికించి మాత్రమే మెలకెత్తిన గింజలను తీసుకోండి.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.