https://oktelugu.com/

Nagarjuna-Naga Chaitanya : నాగార్జున కి పోటీగా నాగ చైతన్య..రిక్వెస్ట్ చేసినా వెనక్కి తగ్గని నాగ చైతన్య..పెళ్లి కి ముందే పెద్ద పంచాయితీ!

అక్కినేని కుటుంబం నుండి ఇద్దరి హీరోలు ఒకే నెలలో ప్రతిష్టాత్మక చిత్రాలతో అభిమానుల ముందుకు రావడం ఇదే తొలిసారి. మరి ఈ రెండు సినిమాలు అభిమానులు ఆకలిని తీరుస్తాయా లేవా అనేది చూడాలి.

Written By:
  • Vicky
  • , Updated On : November 5, 2024 / 09:34 PM IST

    Nagarjuna-Naga Chaitanya

    Follow us on

    Nagarjuna-Naga Chaitanya : నాగ చైతన్య కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తండేల్’. అల్లు అరవింద్ నిర్మాతగా చందు మొండేటి దర్శకత్వంలో గీత ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాపై అక్కినేని అభిమానులు కోటి ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే ఈమధ్య కాలం లో ఈ కుటుంబం నుండి వచ్చిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద అంతంత మాత్రంగానే ఆడాయి. నాగచైతన్య గత రెండు చిత్రాలు ఘిరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం లో ‘దూత’ అనే వెబ్ సిరీస్ తో మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకొని నాగ చైతన్య మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు కానీ, థియేటర్ ఆడియన్స్ ని అలరించడం ఒక్కటే బ్యాలన్స్ ఉంది. అది ‘తండేల్’ చిత్రంతో నెరవేరుతుందని బలమైన నమ్మకం తో ఉన్నారు. ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

    ‘లవ్ స్టోరీ’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ‘గేమ్ చేంజర్’ కి పోటీగా దింపుతారని సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున గత కొంతకాలం నుండి ఒక వార్త చక్కర్లు కొట్టింది. అయితే నేడు ఆ చిత్ర నిర్మాత అల్లు అరవింద్ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి, ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 7వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నామని అధికారిక ప్రకటన చేసారు. అయితే ఇక్కడే అసలు సిసలు ట్విస్ట్ ఉంది. అదే నెలలో అక్కినేని నాగార్జున నటించిన ‘కుభేర’ చిత్రాన్ని కూడా విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున, ధనుష్, రష్మిక మందాన ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా మీద కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 21 వ తారీఖున విడుదల చేయబోతున్నారట.

    ఇలా అక్కినేని కుటుంబం నుండి ఇద్దరి హీరోలు ఒకే నెలలో ప్రతిష్టాత్మక చిత్రాలతో అభిమానుల ముందుకు రావడం ఇదే తొలిసారి. మరి ఈ రెండు సినిమాలు అభిమానులు ఆకలిని తీరుస్తాయా లేవా అనేది చూడాలి. ఇది ఇలా ఉండగా నాగ చైతన్య ప్రముఖ యంగ్ హీరోయిన్ శోభిత దూళిపాళ్ల తో ఆగస్టు నెలలో నిశ్చితార్థం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరు ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీ గా ఉన్నారు. డిసెంబర్ 4వ తారీఖున అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగ చైతన్య, శోభితల పెళ్లి అట్టహాసంగా అతిరథ మహారథుల సమక్ష్యం లో జరగనుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అతి త్వరలోనే చేయనుంది అక్కినేని ఫ్యామిలీ.