https://oktelugu.com/

Shankar Dada MBBS’ Movie : శంకర్ దాదా MBBS’ లో చిరంజీవి కి నాన్నగా నటించిన ఈ నటుడు గుర్తున్నాడా? ఈయన కూతురు రేంజ్ చూస్తే ఆశ్చర్యపోతారు!

శంకర్ దాదా MBBS సినిమాలో చిరంజీవి తో పాటు ఆయనతో కలిసి నటించిన నటులు కూడా తమ పాత్రల్లో జీవించేసారు. ముఖ్యంగా చిరంజీవి తండ్రి పాత్ర పోషించిన వ్యక్తిని అంత తేలికగా మరచిపోలేము. చాలా హుందాతనంతో, పెద్ద మనిషిగా ఆయన తన పాత్రలో జీవించేసాడు. ఆయన పేరు గిరీష్ కర్నాద్.

Written By:
  • Vicky
  • , Updated On : November 5, 2024 / 09:23 PM IST

    Girish Karnad

    Follow us on

    Shankar Dada MBBS’ Movie :  మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ గా నిల్చిన చిత్రాలలో ఒకటి ‘శంకర్ దాదా MBBS ‘. హిందీ లో సంజయ్ దత్, రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘మున్నా భాయ్ MBBS’ చిత్రానికి ఇది రీమేక్. రీమేక్ అయినప్పటికీ కూడా మాతృక కంటే అద్భుతంగా ఉందని, మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ కి, సంజయ్ దత్ కామెడీ టైమింగ్ కి చాలా తేడా ఉందని అప్పట్లో రివ్యూస్ కూడా వచ్చాయి. ‘ఇంద్ర’, ‘ఠాగూర్’, ‘అంజి’ వంటి సీరియస్ మాస్ మూవీస్ తర్వాత, మెగాస్టార్ నుండి ఇలాంటి కామెడీ ఎంటర్టైనర్ వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. అంతటి మాస్ ఇమేజ్ వచ్చిన తర్వాత కామెడీ రోల్ లో చూడడం అభిమానులకు కాస్త కష్టమే. అయినప్పటికీ కూడా డైరెక్టర్ జయంత్ సి పరాన్జీ రిస్క్ చేసి ఈ చిత్రాన్ని తీసాడు. ఫలితం అదిరిపోయింది. ఆరోజుల్లోనే ఈ సినిమాకి దాదాపుగా 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

    అయితే ఈ సినిమాలో చిరంజీవి తో పాటు ఆయనతో కలిసి నటించిన నటులు కూడా తమ పాత్రల్లో జీవించేసారు. ముఖ్యంగా చిరంజీవి తండ్రి పాత్ర పోషించిన వ్యక్తిని అంత తేలికగా మరచిపోలేము. చాలా హుందాతనంతో, పెద్ద మనిషిగా ఆయన తన పాత్రలో జీవించేసాడు. ఆయన పేరు గిరీష్ కర్నాద్. ఈయన ఒక గొప్ప నటుడు, రచయత, డైరెక్టర్. కన్నడ , హిందీ, తెలుగు, మలయాళం ఇలా అన్ని ఇండస్ట్రీస్ లో ఆయన తన అద్భుతమైన ప్రతిభ చూపించి అన్ని విభాగాల్లో గొప్పగా రాణించాడు. తెలుగు లో ఈయన ‘శంకర్ దాదా MBBS’ చిత్రానికి ముందు చైతన్య, ప్రాణదాత, జీవన వేదం, ధర్మ చక్రం వంటి సినిమాల్లో నటించాడు. పవన్ కళ్యాణ్ కొమరం పులి సినిమాలో కూడా ఈయన చిన్న అతిథి పాత్రలో కనిపిస్తాడు. నటుడిగా ఈయనకి 10 నేషనల్ అవార్డులు, 7 ఫిల్మ్ ఫేర్ అవార్డులు, 6 కర్ణాటక స్టేట్ అవార్డులు వచ్చాయి.

    అదే విధంగా రచయితగా ఈయనకి పద్మశ్రీ, పద్మ భూషణ్, జ్ఞాన్ పీఠ్, రాజ్యోత్సవ, సాహితి అకాడమీ, సంగీత్ నాటక్ అకాడమీ, కాళిదాస్ సమ్మన్ వంటి అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారాలు వచ్చాయి. ఇంతటి మహా ప్రస్థానం ఉన్నటువంటి గిరీష్ కి వారసులు లేరా?, ఉంటే ఎక్కడున్నారు, ఇప్పుడేమి చేస్తున్నారు అనే సందేహం మీ అందరిలో రావొచ్చు. గిరీష్ రఘు కర్నాద్ అనే కొడుకు , షల్మాలి రాధ కర్నాద్ అనే కూతురు ఉన్నారు. కొడుకు కూడా తండ్రి లాగానే గొప్ప రచయితగా స్థిరపడ్డాడు. విదేశాల్లో ఎన్నో ప్రముఖ సంస్థల్లో ఆయన జర్నలిస్ట్ గా కొనసాగుతున్నాడు. ఇక గిరీష్ కూతురు షల్మాలి విషయానికి వస్తే ఈమె డాక్టర్ చదివి సౌత్ ఆఫ్రికా లో ‘విమెన్ లిఫ్ట్ హెల్త్’ అనే సంస్థకి చైర్మన్ గా వ్యవహరిస్తూ ఎన్నో అద్భుతమైన సేవ కార్యక్రమాలు చేస్తుంది. వీళ్లిద్దరి ఫోటోలను ఎక్సక్లూసివ్ గా మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.