https://oktelugu.com/

Solo Life : పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండాలనుకుంటున్నారా.. అయితే ఇది మీ కోసమే!

ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సహజం. గతంలో జరిగిన విషయాలు పరిగణలోకి తీసుకుని జీవితం మొత్తాన్ని నాశనం చేసుకోవద్దు. పెళ్లి చేసుకోకుండా ఇలా ఒంటరిగా ఉండిపోయిన వాళ్లను మనం డైలీ చూస్తునే ఉంటాం. బయటకు సంతోషంగా ఉన్నా మనసులో బాధ మాత్రం మిగిలి ఉంటుంది.

Written By:
  • Neelambaram
  • , Updated On : September 24, 2024 / 02:35 AM IST

    Solo Life

    Follow us on

    Solo Life :  ప్రస్తుతం యువత పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండటానికి ఇష్టం చూపిస్తుంది. అప్పటి రోజుల్లో పెళ్లి వయస్సు రాకముందే తల్లిదండ్రులు పెళ్లి చేసేవారు. కానీ ఈరోజుల్లో పెళ్లి వయస్సు దాటుతున్న కూడా యువత ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకుంటుంది. ఒంటరిగా ఉండటమే బాగుంటుంది.. ఎవరూ లేకుండా ఫ్రీడమ్‌గా ఇలా ఉండవచ్చని కొందరు భావిస్తారు. కానీ అది కూడా కొన్ని రోజులు మాత్రమేనని నిపుణులు అంటున్నారు. ప్రతి మనిషికి వాళ్ల జీవితంలో ఒక తోడు తప్పకుండా కావాలి. ఎప్పుడు ఎవరూ కూడా ఒకేలా ఉండరు. వ్యక్తిగత కారణాలు, బయట సిట్యూవేషన్స్ చూసి పెళ్లి చేసుకోవాలని అనిపించదు. కానీ మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు లేదా ఒంటరిగా ఉన్నామనే భావన వస్తే ఆ రోజు మనకి ఒక తోడు ఉంటే బాగుంటాదని అనిపిస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సహజం. గతంలో జరిగిన విషయాలు పరిగణలోకి తీసుకుని జీవితం మొత్తాన్ని నాశనం చేసుకోవద్దు. పెళ్లి చేసుకోకుండా ఇలా ఒంటరిగా ఉండిపోయిన వాళ్లను మనం డైలీ చూస్తునే ఉంటాం. బయటకు సంతోషంగా ఉన్నా మనసులో బాధ మాత్రం మిగిలి ఉంటుంది.

    పెళ్లి కాని వాళ్లతో పోలిస్తే పెళ్లయిన వాళ్లు భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఎవరికి కూడా తల్లిదండ్రులు చివరి వరకు ఉండిపోరు. తోడ పుట్టిన వాళ్లు కూడా కొంత వరకు మాత్రమే ఉంటారు. జీవితాంతం మీతో ఉండేది కేవలం మీ భాగస్వామి మాత్రమే. ఆరోగ్యంగా ఉన్నారనుకుంటే.. మీ పనులు అన్ని మీరు చేసుకుంటారు. అదే ఏదైనా సమస్య వస్తే మీ పనులు కూడా చేసుకోలేరు. ఇతరుల మీద ఆధారపడాల్సి వస్తుంది. అప్పుడు మీకు ఎందుకు పెళ్లి చేసుకోలేదని బాధ వస్తుంది. కాబట్టి ఎలా అయిన పెళ్లి చేసుకోండి. ఒంటరిగా ఉండవద్దు. మీకు కాస్త చిరాకుగా ఉన్నా, అనారోగ్య సమస్యలు వచ్చిన మీతో మాట్లాడటానికి భాగస్వామి ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు వచ్చిన కూడా మళ్లీ కలిసిపోయి సంతోషంగా ఉంటారు. అదే ఒంటరిగా ఉంటే జీవితాంతం ఏదో వెలితిగా ఉంటుంది. బలం ఉన్న అన్ని రోజులు మీ పనులు మీరు చేసుకుంటారు. అదే బలం లేకపోతే ఇతరుల మీద ఆధారపడాల్సి వస్తుంది. ప్రస్తుతం చాలా మంది కూడా ఈ సమాజంలో ఉన్నారు. ఒంటరిగా జీవించాలగలమని భావించి పెళ్లి చేసుకోకుండా ఉంటారు. కానీ చివరికి ఆ బాధతో మిగిలిపోతారు.

    పురుషుడు లేదా మహిళ అయిన వివాహం చేసుకుంటేనే ఈ సమాజంలో విలువ ఉంటుంది. లేకపోతే ఎవరూ కూడా విలువ ఇవ్వరు. మీ సొంత బంధువులు కూడా కనీసం మీకు అన్నం పెట్టరు. మీ దగ్గర డబ్బులు అధికంగా ఉంటే వాటి కోసం వస్తారు. లేదంటే అసలు మిమ్మల్ని పట్టించుకోరు. కాబట్టి తొందరగా పెళ్లి చేసుకున్న, లేటుగా చేసుకున్న మీకు సరైన జోడీని చూసి పెళ్లికోవడం ఉత్తమం. అప్పుడే జీవితం సాఫీగా సాగుతుంది. లేకపోతే జీవితాంతం మిమ్మల్ని ఒంటరితనం వేధిస్తుంది. ఈ సమాజంలో డబ్బుకి ఇచ్చే విలువ మనుషులు, బంధువులకు ఇవ్వరు. కాబట్టి అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని, బాగా ఆలోచించి వివాహం చేసుకోండి. లేకపోతే జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొవలసి వస్తుంది. ఒక్కసారి పెళ్లి చేసుకుని.. పిల్లలను కనండి. అసలైన ప్రేమ అంటే ఏంటో మీకే తెలుస్తుంది. జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్న పిల్లలను చూస్తే ఇట్టే మాయమైపోతాయి.