https://oktelugu.com/

cumin water : ఉదయాన్నే జీరా వాటర్ తాగితే.. ఎన్నో సమస్యల నుంచి ఉపశమనం

అలాగే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. గ్లాసు నీటిలో జీలకర్ర వేసి ఒక ఐదు నిమిషాల పాటు మరగించాలి. చల్లారిన తర్వాత ఆ నీటిని తాగితే సమస్యలన్నీ దూరం అయిపోతాయి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 6, 2024 / 03:25 AM IST

    If you drink cumin water in the morning, you will get relief from many problems

    Follow us on

    cumin water : ఆరోగ్యంగా ఉండాలంటే డైలీ లైఫ్‌లో కొన్ని నియమాలు పాటించాలి. లేకపోతే లేని పోని అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. అయితే చాలా మంది ఉదయం లేచిన వెంటనే టీ లేదా కాఫీ తాగుతారు. పరగడుపున వీటిని తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీటికి బదులు జీలకర్ర వాటర్‌ను తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా జీలకర్రను మనం రోజూ వంటల్లో వాడుతాం. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి లాభాలే కానీ నష్టాలు లేవు. వీటిని డైలీ ఏదో విధంగా తినడం వల్ల శరీరానికి బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జీలకర్రను డైరెక్ట్‌గా తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదే. కానీ చాలామంది ఇలా తినలేక.. జీరా రైస్ చేసుకుని తింటారు. ఏదో విధంగా డైలీ వీటిని తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. అయితే జీలకర్ర నీరు రోజూ తాగడం వల్ల ఎన్నో సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. మరి ఏయే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందో తెలుసుకుందాం.

    జీలకర్ర వాటర్‌ను ఉదయాన్నే పరగడుపున తినడం వల్ల స్థూలకాయం తగ్గుతుంది. ఇది జీవక్రియను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు బరువును అదుపులో ఉంచుతుంది. ఇందులోని పోషకాలు జీర్ణ సమస్యలను తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. కొందరు కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు తప్పనిసరిగా జీలకర్ర వాటర్‌ను తీసుకోవడం వల్ల సమస్య తీరుతుంది. కొందరు ఊబకాయంతో బాధపడుతుంటారు. అలాంటి వారికి జీలకర్ర వాటర్ బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఉదయాన్నే ఈ నీరు తీసుకోవడం వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. అలసట, నీరసం అన్ని కూడా తగ్గుతాయి. ఉదయం లేచిన వెంటనే కాఫీ, టీకి బదులు జీలకర్ర నీరు తాగడం వల్ల అన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇందులో పీచు ఎక్కువగా ఉంటుంది. యాసిడ్, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలను కూడా తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులోని పోషకాలు రక్తప్రసరణ ఆరోగ్యంగా ఉండేలా చేయడంతో పాటు ఇన్సులిన్ స్థాయిలను కూడా పెంచడంలో బాగా ఉపయోగపడుతుంది.

    కొందరు మలబద్దకం, జీర్ణ సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారికి జీలకర్ర వాటర్ బాగా పనిచేస్తాయి. అలాగే డయాబెటిస్ ఉన్నవారు ఉదయాన్నే తాగడం చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోని మంటలను కూడా తగ్గిస్తాయి. అలాగే శరీరంలో పేరుకుపోయి ఉన్న విష పదార్థాలను తొలగించడంలో జీలకర్ర వాటర్ బాగా పనిచేస్తుంది. వీటితో పాటు ఎముకలు, కండరాలు బలంగా ఉంటాయి. ముఖ్యంగా గర్భిణులకు మేలు చేస్తుంది. రోజూ ఈ వాటర్ తాగడం వల్ల ప్రెగ్నెన్సీలో వచ్చే సమస్యలను తగ్గించడంతో పాటు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. బాలింతలు జీలకర్ర వాటర్‌ను ఉదయాన్నే తాగడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. గ్లాసు నీటిలో జీలకర్ర వేసి ఒక ఐదు నిమిషాల పాటు మరగించాలి. చల్లారిన తర్వాత ఆ నీటిని తాగితే సమస్యలన్నీ దూరం అయిపోతాయి.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.