Diabetes : మధుమేహం ఉన్నవారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే సమస్య తీవ్రతరం అయ్యి మరణం సంభవించవచ్చు. మధుమేహం ఉన్నవారు చక్కెర, కార్బోహైడ్రేట్లు ఉండే పదార్థాలను ఎక్కువగా తీసుకోకూడదు. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఏ పదార్థం తిన్నా ఆలోచించి తినాలి. మధుమేహం ఉన్నవారు ఎక్కువగా గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అయితే మధుమేహం ఉన్నవారు వేరుశెనగ తినకూడదని చాలామంది సందేహ పడతారు. వేరుశెనగలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కానీ వీటిని మధుమేహం ఉన్నవారు తింటే చక్కెర స్థాయిలు పెరుగుతాయని వీటిని తినడం మానేస్తున్నారు. మరి మధుమేహం ఉన్నవారు వేరుశెనగలు తినవచ్చా? తింటే ఏమవుతుందో మరి తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.
డయాబెటిస్ ఉన్నవారు స్వీట్లు, చక్కెర పదార్థాలకు దూరంగా ఉండాలి. కాస్త చిన్న ముక్క తిన్న ఒక్కసారిగా చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. అయితే డయాబెటిస్ ఉన్నవారు వేరుశెనగ గింజలను తినవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని తినడం వల్ల చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. వేరుశెనగ గింజల్లో ప్రొటీన్, ఫైబర్, ఆరోగ్యమైన కొవ్వు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి డయాబెటిస్ రోగులను ఆరోగ్యంగా ఉంచడంలో బాగా ఉపయోగపడుతుంది. ఇందులో మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో బాగా ఉపయోగపడతాయి. గుండె ప్రమాదాలు రాకుండా సాయం చేస్తుంది. కూరల్లో కూడా మార్కెట్లో దొరికే నూనెలను కంటే.. వేరుశెనగ నూనెను వాడితే ఆరోగ్యంగా ఉంటారు. మార్కెట్లో దొరికే వేరుశెనగ నూనె కంటే ఎలాంటి రసాయనాలు లేకుండా గానుగ నూనెను వాడటం మేలు.
మధుమేహం ఉన్నవారు వేరుశెనగలను తినడం వల్ల శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. అయితే వీటిని పరిమిత సంఖ్యలో మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి ప్రమాదమే. మధుమేహం ఉన్నవారు రోజుకి ఒక పిడికెడు వేరుశెనగలను మాత్రమే తీసుకోవాలి. అయితే వీటిని చక్కెర, ఉప్పుతో తినకూడదు. ఇవి లేకుండా తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. వీటిని సలాడ్, బెల్లం చెక్కీలుగా చేసి తినవచ్చు. ఇందులో మినరల్స్, ఫైబర్ గుండెకు మేలు చేయడంతో పాటు రక్తపోటును కూడా నియంత్రిస్తాయి. అయితే కొంతమంది మధుమేహ రోగులకు వేరుశెనగలు తినడం వల్ల అలర్జీ వస్తుంది. ఇలాంటి వాళ్లు వేరుశెనగ గింజలను తినకపోవడం ఆరోగ్యానికి మంచిది. వీటిని రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే పరగడుపున తినడం వల్ల ఆరోగ్యంగా బరువు పెరుగుతారు. సన్నగా ఉన్నవారు డైలీ ఒక మూడు నెలల పాటు ఇలా చేయడం వల్ల ఫిట్‌గా బరువు పెరుగుతారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.