Homeజాతీయ వార్తలుIndia Best Road Trips : ఇండియాలో బెస్ట్ రోడ్ ట్రిప్స్.. లైఫ్‌లో ఒక్కసారైన ఈ...

India Best Road Trips : ఇండియాలో బెస్ట్ రోడ్ ట్రిప్స్.. లైఫ్‌లో ఒక్కసారైన ఈ రోడ్స్‌లో ప్రయాణించాల్సిందే!

India Best Road Trips :  మన దేశం ఎన్నో ఆచారాలు, సంప్రదాయాలకు ప్రసిద్ది చెందింది. ఈ సుందరమైన దేశంలో ఎన్నో రకాల అందాలు ఉన్నాయి. మన దేశంలో ఉండే సుందరమైన ప్రదేశాలకు వెళ్లాలని మనుషులు ఆరాట పడుతుంటారు. కానీ అందరూ అన్ని ప్రదేశాలను వీక్షించలేరు. కొందరు మాత్రం ప్రకృతి ప్రేమికులు వాళ్లకు ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లి వచ్చేస్తారు. ఎంత బిజీగా ఉన్నా సరే.. ప్రకృతిని ఆస్వాదించాలని టైమ్ సెట్ చేసుకుని మరి వెళ్తుంటారు. ఇలా బయటకు వెళ్లడం వల్ల డబ్బు ఖర్చు అవుతుంది. కానీ మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు. కొత్త ప్రదేశాలకు వెళ్లడం కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటారు. మరీ ముఖ్యంగా చాలామందికి రోడ్ ట్రిప్స్ అంటే చాలా ఇష్టం. కొన్ని ప్రదేశాల్లో కార్ లేదా బైక్ మీద ప్రయాణించాలని చాలా ఆశపడుతుంటారు. నిజం చెప్పాలంటే ఇలాంటి రోడ్ ట్రిప్స్‌కి వెళ్తే చాలు.. ఈ జన్మకి ఇంకేం వద్దని ఫీల్ అవుతుంటారు. అయితే ఇండియాలో చాలానే రోడ్ ట్రిప్స్ ఉన్నాయి. మరి బెస్ట్ రోడ్ ట్రిప్స్ ఏవో ఈరోజు స్టోరీలో మనం తెలుసుకుందాం.

మనాలి టూ లేహ్
చాలామంది డ్రీమ్ ప్లేస్ లేహ్. ఇది జమ్మూ కాశ్మీర్‌లోని లడఖ్‌లో ఉంది. మనాలి నుంచి లేహ్‌కి 427 కిలో మీటర్ల దూరం ఉంటుంది. మనాలీ నుంచి లేహ్ వెళ్లే రోడ్డు రూట్ చాలా బాగుంటంది. మంచు కొండల మధ్యలో బైక్ మీద వెళ్తుంటే ఆ ఫీల్ వేరే. చాలా మంది కారులో ప్రయాణిస్తారు. కానీ బైక్ మీద వెళ్తే చాలా ఎంజాయ్ చేస్తారు. లైఫ్‌లో ఒక్కసారి అయిన ఇలాంటి జర్నీ చేయాలని ఎక్కువ మంది భావిస్తారు. మనాలి నుంచి లేహ్ వెళ్లిన తర్వాత అక్కడ చూడటానికి చాలా పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.

మున్నార్ టూ అల్లెప్పీ
చాలామందికి కేరళ డ్రీమ్ ప్లేస్. అందులో మున్నార్, అల్లెప్పీ అంటే ఇంకా చెప్పక్కర్లేదు. అయితే మున్నార్ నుంచి అల్లెప్పీకి రోడ్డు మార్గంలో ప్రయాణిస్తే.. పచ్చని చెట్టులు, కాఫీ తోటలు, ఆ వాతావరణం, కొండలు, ప్రకృతి అందాలు మనస్సును కట్టిపడేస్తాయి. లైఫ్‌లో ఒక్కసారైన కేరళకు రోడ్డు ట్రిప్ వెళ్లాల్సిందే.

భుజ్ నుంచి ధోలావిరా
ధోలవిరా అనే ప్లేస్ రాన్ ఆఫ్ కచ్‌‌కి సమీపంలో ఉంటుంది. ఇది భుజ్ నగరం నుంచి దాదాపు 220 కిలో మీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడి నుంచి ధోలావిరాకు బైక్ లేదా ట్యాక్సీ మీద ప్రయాణిస్తుంటే.. మధ్యలో మీరు ఎన్నో రకాలు ఫుడ్స్ ఉంటాయి. ఈ ప్రయాణంలో రెండు వైపులా అతి పెద్ద ఉప్పు ఎడారిని కనిపిస్తుంది. దీనిని చూడటానికి మీకు రెండు కళ్లు చాలవు. ఎందుకంటే ఇక్కడ ఆకాశం, భూమిను గుర్తించలేరు. ఇది చాలా పెద్దది కూడా. భుజ్ నుంచి దాదాపు 4 గంటల పాటు ప్రయాణించి.. ఈ ఉప్పు ఎడారిని ఎక్స్‌పీరియన్స్ చేయవచ్చు. అయితే ధోలావిరా అనేది ఒక పురాతన నాగరిక ప్రదేశం. దీనిని చూడటానికి చాలా మంది వెళ్తుంటారు.

గ్యాంగ్‌టక్ టూ గురుడోంగ్మార్
సిక్కిం రాష్ట్రంలో ఉండే గురుడోంగ్మార్ ఒక అందమైన ప్రదేశం. ప్రకృతి అందాల నడుమ గ్యాంగ్ టక్ నుంచి గురుడోంగ్మార్ వరకు రోడ్డు ప్రయాణం చేస్తే మనస్సుకు చాలా ఆహ్లాదకంగా ఉంటుంది. తెల్లటి మంచు కొండల మధ్య ప్రయాణం.. మీ ఉహాకే వదిలేస్తున్నాను. అయితే ఈ గురుడోంగ్మార్‌లో గురుడోంగ్మార్ సరస్సు ఉంది. ఈ సరస్సుకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ సరస్సులో కొంతభాగం నవంబర్ నుంచి మే వరకు గడ్డ కడుతుంది. మిగతా భాగం గడ్డకట్టకుండా నీరు ఉంటుంది.

సిమ్లాక టూ స్మితి
హిమాచల్ ప్రదేశ్‌లో ఎప్పుడూ తెల్లని మంచుతో కప్పబడి ఉంటుంది. ఇక్కడి ప్రకృతి అందాలను చూడటానిక చాలా మంది వెళ్తుంటారు. అయితే సిమ్లా నుంచి స్మితికి రోడ్డు ప్రయాణం తప్పకుండా చేయాల్సిందే. ఆ రోడ్డు మీద వాహనంలో వెళ్తుంటే.. చుట్టుూ కొండలు, కొండల్లో సన్యాసులు నివసించే మోనాస్టోరీలు ఉంటాయి. ఇవి చూడటానికి చాలా చక్కగా కనిపిస్తారు. ఈ మఠాలు కొండపై అంచున ఉంటాయి. ఇవి చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి.

 

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version