https://oktelugu.com/

ఈ లక్షణాలు కనిపిస్తే తీవ్రమైన కరోనా సోకే ఛాన్స్.. శాస్త్రవేత్తల హెచ్చరిక..?

చలికాలం మొదలై దాదాపు రెండు నెలలైంది. దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య తగ్గుతున్నా మళ్లీ కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే కరోనా బారిన పడినా వైరస్ యొక్క లక్షణాలను బట్టి ప్రాణాలకు అపాయమో లేదో తెలుసుకోవచ్చని వైద్యులు వెల్లడిస్తున్నారు. సాధారణంగా కరోనా సోకితే దగ్గు, జలుబు, శ్వాస సంబంధిత సమస్యలు కనిపిస్తాయి కానీ కరోనా తీవ్రమైన లక్షణాలు వేరే ఉంటాయని కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లకు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 22, 2020 11:23 am
    Follow us on

    Corona Virus
    చలికాలం మొదలై దాదాపు రెండు నెలలైంది. దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య తగ్గుతున్నా మళ్లీ కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే కరోనా బారిన పడినా వైరస్ యొక్క లక్షణాలను బట్టి ప్రాణాలకు అపాయమో లేదో తెలుసుకోవచ్చని వైద్యులు వెల్లడిస్తున్నారు. సాధారణంగా కరోనా సోకితే దగ్గు, జలుబు, శ్వాస సంబంధిత సమస్యలు కనిపిస్తాయి కానీ కరోనా తీవ్రమైన లక్షణాలు వేరే ఉంటాయని కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లకు సైతం తీవ్రమైన కరోనా బారిన పడతారని వైద్యులు చెబుతున్నారు.

    Also Read: కొత్తరకం వైరస్ పై కరోనా టీకా పని చేస్తుందా? పరిశోధకులు ఏమంటున్నారు?

    కరోనా బారిన పడిన వారిలో కొందరిలో జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని.. కడుపునొప్పి, వాంతులు, వికారం, విరేచనాలు, ఆకలి లేకపోవడం లాంటి లక్షణాలు తీవ్రమైన కరోనా లక్షణాలని వైద్యులు తెలుపుతున్నారు. కొందరిలో ఊపిరి సంబంధిత సమస్యలు, జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తాయని ఈ ఆరోగ్య సమస్యలు కూడా ప్రమాదకరమేనని వైద్యులు వెల్లడిస్తున్నారు.

    Also Read: కరోనా కొత్తరకం వైరస్ కు వ్యాక్సిన్ పని చేస్తుందా..?

    క్యాన్సర్ తో బాధపడే వాళ్లకు కరోనా ముప్పు ఎక్కువని డీ.ఎన్.ఏలో క్రోమోజోమ్ లను బట్టి కూడా కరోనా వైరస్ ప్రభావం ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటుందని వైద్యులు వెల్లడిస్తున్నారు. 2,200 మంది కరోనా బాధితులపై చేసిన అధ్యయనం ద్వారా ఈ విషయాలు వెల్లడయ్యాయి. హార్మోన్ల సమస్యలు ఉన్నా కరోనా వేగంగా ప్రభావం చూపుతుందని.. హార్మోన్ల సమస్యతో బాధ పడే వాళ్లలో పురుషుల్లో అంగస్తంభన సమస్యలు, మహిళల్లో రుతుచక్రాలలో మార్పులు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    విటమిన్ డి లోపం కూడా కరోనా మహమ్మారి ముప్పును పెంచుతుందని.. శరీరంలో తగిననంత డి విటమిన్ లేకపోతే వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోవాలని.. డీ విటమిన్ లోపం ఇమ్యూనిటీ పవర్ పై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు వెల్లడిస్తున్నారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడే వాళ్లకు కూడా కరోనా ముప్పు ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.