https://oktelugu.com/

ఏపీ, తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్

జీఎస్టీ లాంచ్ చేసినప్పుడు కేంద్రం బడాయిలకు పోయింది. జీఎస్టీ అమలుతో రాష్ట్రాలు నష్టపోతే పరిహారం ఇస్తానని హామీ ఇచ్చింది. ఆ తర్వాత కరోనా వచ్చింది. ఆదాయం పడిపోయింది. దీంతో రాష్ట్రాలకు కేంద్రం హ్యాండ్ ఇచ్చింది. జీఎస్టీ అమలు కారణంగా ఏర్పడిన రెవెన్యూ లోటు భర్తీకి పరిహారానికి బదులు కేంద్రం నుంచి రుణాలు తీసుకునేందుకు రాష్ట్రాలు అంగీకరించాయి. ఈ క్రమంలోనే ప్రత్యేక విండోను ఏర్పాటు చేసి రాష్ట్రాలకు కేంద్రం రుణాలు మంజూరు చేస్తోంది. Also Read: భూసర్వేతో లక్షన్నర […]

Written By:
  • NARESH
  • , Updated On : December 22, 2020 / 09:15 AM IST
    Follow us on

    జీఎస్టీ లాంచ్ చేసినప్పుడు కేంద్రం బడాయిలకు పోయింది. జీఎస్టీ అమలుతో రాష్ట్రాలు నష్టపోతే పరిహారం ఇస్తానని హామీ ఇచ్చింది. ఆ తర్వాత కరోనా వచ్చింది. ఆదాయం పడిపోయింది. దీంతో రాష్ట్రాలకు కేంద్రం హ్యాండ్ ఇచ్చింది. జీఎస్టీ అమలు కారణంగా ఏర్పడిన రెవెన్యూ లోటు భర్తీకి పరిహారానికి బదులు కేంద్రం నుంచి రుణాలు తీసుకునేందుకు రాష్ట్రాలు అంగీకరించాయి. ఈ క్రమంలోనే ప్రత్యేక విండోను ఏర్పాటు చేసి రాష్ట్రాలకు కేంద్రం రుణాలు మంజూరు చేస్తోంది.

    Also Read: భూసర్వేతో లక్షన్నర కోట్ల ఆస్తులు వస్తయంట

    అక్టోబర్ 23 నుంచి రాష్ట్రాలు రుణాలు తీసుకునేందుకు విడతల వారీగా కేంద్రం అనుమతించింది. నవంబర్ 2, నవంబర్ 9, నవంబర్ 23, డిసెంబర్ 1, డిసెంబర్ 7, డిసెంబర్ 14 ఇలా మొత్తం ఏడు విడతల్లో ఇప్పటివరకు రాష్ట్రాలకు కేంద్రం రుణాలు మంజూరు చేసింది.

    ఇప్పటివరకు కేంద్రం విడుదల చేసిన మొత్తం రూ.48 వేల కోట్లకు చేరింది. వీటిలో ఆంధ్రప్రదేశ్ కు రూ.1181.61 కోట్లు కాగా.. తెలంగాణకు రూ.688.59 కోట్లు విడుదల చేసింది.తాజాగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం ఎనిమిదో విడత జీఎస్టీ రుణాలను విడుదల చేసింది. జీఎస్టీ పరిహారం కింద అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.6వేల కోట్లు విడుదల చేసింది.

    Also Read: తిరుపతిని టార్గెట్‌ చేసిన టీడీపీ..: వ్యూహకర్తను రంగంలోకి దింపిందిగా..

    కరోనా కష్టకాలంలో తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఈ తీపికబురును అందించింది. ఆర్థిక కల్లోలంలో ఆసరాగా నిలిచింది. పెండింగ్ బకాయిలను విడుదల చేసి ఊరటనిచ్చింది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్