https://oktelugu.com/

Stress: మీలో ఒత్తిడి పెరిగిందో లేదో.. ఈ లక్షణాలతో గుర్తించండి

ఒత్తిడి పెరిగినట్లయితే కొందరిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా నిద్రలో ఉన్నప్పుడు తెల్లవారు జామున అకస్మాత్తుగా తెలివి వస్తుంది. వచ్చిన కలలు కూడా భయంకరమైనవి వస్తాయి. ఎందుకంటే ఒత్తిడికి గురైనప్పుడు నెగిటివ్‌గా ఎక్కువగా ఆలోచిస్తారు.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 25, 2024 / 05:01 PM IST

    Stress

    Follow us on

    Stress: ఒక మనిషికి శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో.. మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనిని అయిన చేయగలరు. ఈ రోజుల్లో కొందరు బాగా ఒత్తిడికి లోనవుతున్నారు. దీంతో తీవ్రంగా మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల మెదడు పనితీరు తగ్గిపోవడం, ఏ పని సరిగ్గా చేయలేకపోవడం వంటి సమస్యలు బారిన పడుతున్నారు. మానసికంగా ఆరోగ్యంగా లేనప్పుడు రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. దీంతో అనారోగ్య సమస్యల బారిన పడతారు. ఒత్తిడి వల్ల నిద్రపట్టదు, ఆకలి వేయదు వంటి సమస్యలు అన్ని కూడా కనిపిస్తాయి. అయితే కొందరు బాగా ఒత్తిడికి గురై ఉంటారు కానీ ఆ విషయం వారికి తెలియదు. ఇలా తెలియక కొందరు ఒత్తిడి సమస్యను పెంచుకుంటారు. కానీ తగ్గించుకోవడానికి ఎలాంటి నియమాలు కూడా పాటించరు. అయితే ఒత్తిడితో బాధపడుతున్నట్లయితే మన బాడీలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని బట్టి మనం ఒత్తిడికి బాగా గురై మానసిక సమస్యలతో బాధపడుతున్నామా? లేకపోతే మానసికంగా ఆరోగ్యంగా ఉన్నామనే విషయాన్ని గుర్తించవచ్చు. మరి ఒత్తిడి పెరిగిందో లేదో గుర్తించాల్సిన లక్షణాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

    ఒత్తిడి పెరిగినట్లయితే కొందరిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా నిద్రలో ఉన్నప్పుడు తెల్లవారు జామున అకస్మాత్తుగా తెలివి వస్తుంది. వచ్చిన కలలు కూడా భయంకరమైనవి వస్తాయి. ఎందుకంటే ఒత్తిడికి గురైనప్పుడు నెగిటివ్‌గా ఎక్కువగా ఆలోచిస్తారు. దీంతో నెగిటివ్ కలలు వస్తుంటాయి. హాయిగా నిద్రపోలేరు. మనస్సులో ఏదో ఒక ఆందోళన ఉంటుంది. కారణం లేకుండానే బాడీకి చెమటలు పడతాయి. ఛాతీ, మెడ, భుజాలు అన్ని నొప్పిగా ఉంటాయి. రోజంతా ఎంత అలసిపోయిన కూడా బాడీకి నిద్రపట్టదు. ఎక్కువగా అలసటగా అనిపించడం, విచారం, ఎప్పుడూ దిగులుగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటితో పాటు రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, కండరాలు నొప్పులు, అధిక రక్తపోటు, జీర్ణ సమస్యలు వంటి శారీరక లక్షణాలు కూడా కొందరిలో ఉంటాయి. అయితే అందరిలో ఇవే లక్షణాలు ఉండవు. ఒక్కోరిలో ఒక్కో లక్షణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడికి లోనైతే చాలా అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    ఒత్తిడి నుంచి విముక్తి చెందాలంటే ప్రతీ ఒక్కరూ కూడా కొన్ని నియామాలు పాటించాలి. ముఖ్యంగా డైలీ యోగా, వ్యాయామం, మెడిటేషన్ వంటివి చేస్తుండాలి. బాడీకి సరిపడా రోజూ నిద్రపోవాలి. నిద్ర రాకుండా ఉండే పదార్థాలను అసలు తీసుకోకూడదు. ముఖ్యంగా కెఫిన్ పదార్థాలకు దూరంగా ఉండాలి. ఆల్కహాల్, ధూమపానం వంటివి చేయకూడదు. వీటి వల్ల ఒత్తిడి పెరుగుతుంది. అలాగే కుటుంబ సభ్యులు లేదా ఇష్టమైన వారితో సమయం గడుపుతుండాలి. కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్లడం వంటివి చేస్తుంటే ఒత్తిడి నుంచి కాస్త విముక్తి పొందుతారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.