ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు డిసెంబర్ 22, 2024న రాజస్థాన్లో వెంకట దత్త సాయిని వివాహం చేసుకుంది.
ఈ జంట వివాహ దుస్తులను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు.
ఈ ప్రత్యేకమైన రోజు కోసం, పివి సింధు అందమైన పురాతన బంగారు చేతితో నేసిన టిష్యూ చీరను ధరించి ఎంతో అట్రాక్టివ్ గా కనిపించింది.
ఆమె నెక్లెస్లు, చెవిపోగులు లు కూడా ఎంతో అందంగా ఉన్నాయి.
ఇక వీరి వివాహ వేడుకకు చాలా మంది ప్రముఖులు హాజరు అయ్యారు.
పెళ్లిల్లో కొత్త దంపతుల అల్లరి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.
పీవీ సింధు పెళ్లి చేసుకున్న వెంకట దత్త సాయి.. పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు.
ఈ విషయాన్ని ఆమె తండ్రి పీవీ రమణ స్వయంగా వెల్లడించారు. ఈనెల 14న వీరిద్దరి ఎంగేజ్మెంట్ కూడా ఘనంగా జరిగితే డిసెంబర్ 22 న పెళ్లి జరిగింది.