Ideal body weight: ప్రస్తుత కాలంలో చాలా మంది బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఆహారపు అలవాట్లతో పాటు ఒత్తిడి అధికంగా ఉండడం వల్ల కొందరు అవసరానికి మించి లావు అవుతున్నారు. అయితే బరువు తగ్గడానికి ప్రత్యేక వ్యాయామాలు చేసినా.. కొన్ని రోజుల పాటు బరువు తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పెరుగుతున్నారు. ఎప్పుడూ ఒకే మాదిరిగా బరువు ఉండడానికి కొన్ని అలవాట్లను చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.మరి ఇందుకోసం ఏం చేయాలంటే?
రాత్రి భోజనం:
రాత్రి 8 గంటల తర్వాత భోజనం చేయకుండా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఆలస్యంగా తినడం వల్ల శరీరంలోని జీవక్రియలు నెమ్మదిస్తాయి. ఆహారం సరిగా జీర్ణం కాక కొవ్వు నిల్వ అయ్యే అవకాశం పెరుగుతుంది. భోజనం తేలికగా ఉండాలి. ఇన్ స్టంట్ ఫుడ్స్, ప్యాకెట్ స్నాక్స్, డీప్ ఫ్రై చేసిన వంటకాలు తరచూ తీసుకోవడం వల్ల కేలరీలు ఎక్కువగా చేరతాయి. వీటిలో ఉప్పు, చక్కెర, కొవ్వు అధికంగా ఉండటం వల్ల బరువు వేగంగా పెరుగుతుంది.
సరిపడా నీరు
రోజంతా తగినంత నీరు తాగడం వల్ల మెటాబాలిజం చురుకుగా ఉంటుంది. కొన్నిసార్లు ఆకలిగా అనిపించేది నిజానికి దాహం కావొచ్చు. కాబట్టి రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తీసుకోవడం మంచిది.ఉదయం అల్పాహారం తీసుకోకపోతే మధ్యాహ్నం ఎక్కువగా తినే అవకాశం ఉంటుంది. ప్రోటీన్, ఫైబర్ ఉన్న అల్పాహారం తీసుకుంటే ఎక్కువసేపు తృప్తిగా ఉంటుంది.
నిత్యం తేలికపాటి వ్యాయామం చేస్తూ ఉండాలి. దీనితో పాటు మెట్లు ఎక్కడం వంటి అలవాట్లు చేసుకోవాలి. రోజూ కనీసం 30 నిమిషాలు అటూ ఇటూ తిరుగుతూ ఉండాలి. శరీరం చురుకుగా ఉంటే కేలరీలు సమర్థంగా ఖర్చవుతాయి. రోజుకు 7నుంచి 8 గంటల నిద్ర లేకపోతే ఆకలి హార్మోన్లు అసమతుల్యం అవుతాయి. దీంతో ఎక్కువగా తినాలనిపిస్తుంది.కూల్ డ్రింక్స్, స్వీట్లు, బేకరీ పదార్థాలు అధిక కేలరీలు ఇస్తాయి కానీ పోషకాలు తక్కువగా ఉంటాయి.స్ట్రెస్ ఉన్నప్పుడు చాలా మంది ఎక్కువగా తినే అలవాటు పడతారు. కాబట్టి యోగా, ధ్యానం ఉపయోగపడతాయి.
అయితే మన శరీరానికి సరైన బరువు ఎంత ఉండాలి? అన్నది తెలుసుకోవడానికి సాధారణంగా BMI (Body Mass Index) పద్ధతిని ఉపయోగిస్తారు. ఇది ఎత్తు, బరువు ఆధారంగా లెక్కించే ప్రమాణం. BMI సాధారణ స్థాయిలో ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉందని భావిస్తారు. ఉదాహరణకు, 60 కిలోల బరువు ఉన్న వ్యక్తి ఎత్తు 1.65 మీటర్లు అయితే BMI సుమారు 22 వస్తుంది. ఇది సాధారణ శ్రేణిలోకి వస్తుంది.
BMI విలువల ప్రకారం..
18.5 కంటే తక్కువ – తక్కువ బరువు
18.5 నుంచి 24.9 వరకు – సాధారణ బరువు
25 నుంచి 29.9 వరకు – అధిక బరువు