Liver Safety: మన శరీర అవయవాల్లో కాలేయం ప్రధానమైనది. మనం తిన్న ఆహారాలను జీర్ణం చేసే పని లివర్ చేస్తుంది. దాదాపు 500 పనులు చేస్తుంది. గ్లూకోజ్ మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. శరీరంలోని విషాలను తొలగిస్తుంది. అయితే మనకు జీర్ణం అయ్యే వాటిని మాత్రమే తినాలి. మన కడుపుకు ఇబ్బందులు కలిగించే వాటిని తీసుకోవడం వల్ల సమస్యలు వస్తాయి. ఇటీవల కాలంలో చాలా మంది మద్యం తాగుతున్నారు. ఫలితంగా లివర్ డ్యామేజ్ అయిపోతోంది. కొందరైతే చీప్ లిక్కర్ తాగుతూ లివర్ కు ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు.

మందు కూడా అధిక మోతాదులో తాగితే అనర్థాలే. మందు విచ్చలవిడిగా తాగడం వల్ల లివర్ ఆరోగ్యం పాడైపోతుంది. మందుబాబులకు ఈ విషయం తెలిసినా పట్టించుకోవడం లేదు. గ్రీన్ టీలో తన్నిన్స్, కటేచిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల లివర్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. లివర్ లో ఉండే ప్రమాదకర విష పదార్థాలు ఫైట్రోసిస్, సిర్రోసిస్, హేపతెతిన్ లాంటి వాటిని యాంటీ ఆక్సిడెంట్లు నాశనం చేస్తాయి. మద్యం అలవాటు ఉన్న వారు టీ, కాఫీలకు బదులు గ్రీన్ టీ తీసుకోవడం మంచిది.
Also Read: TDP vs YCP : రాజకీయాల్లోకి నేతల భార్యలను లాగడం ఎంత వరకు కరెక్ట్?
లివర్ చెడిపోకుండా ఉండటానికి ఆపిల్ ను తీసుకోవడం ఉత్తమమే. మద్యం తీసుకునే వారికి కడుపులో మంటగా అనిపిస్తుంది. జీర్ణాశయంలో కడుపు మంటను తగ్గించడంలో సాయడుతుంది. ఆపిల్ తింటే అందులో ఉండే పెక్టివ్ అనే కెమికల్ లివర్ ఉండే టాక్సిన్స్ నాశనం చేస్తాయి. అల్లం రోజు తింటే డైరెక్ట్ గా ద్రవపదార్థంలా పనిచేసి లివర్ కు మేలు చేస్తుంది. అల్లంలో ఉండే సెలేనియం లివర్ ను కాపాడతాయి. పుల్లగా ఉండే పండ్లు లివర్ కు సాయపడతాయి. మద్యం తాగడం వల్ల అక్కడ పేరుకుపోయిన విష, వ్యర్థాలను నాశనం చేయడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది.
బత్తాయిలు, నారింజ, నిమ్మ పండ్లను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల లాభాలుంటాయి. ఆపిల్ తో పాటు క్యారెట్లు, టమాట, పాలకూర, బీట్ రూట్ లాంటి కూరగాయలను తినడం వల్ల డీటాక్సిఫికేషన్ కు ఉపయోగపడుతుంది. లివర్ బాగుండాలంటే వీటిని తీసుకోవాలి. లివర్ పది కాలాల పాటు పదిలంగా ఉండాలంటే మద్యానికి దూరంగా ఉంటేనే మంచిది. లివర్ సురక్షితంగా ఉండాలంటే మద్యం జోలికి వెళ్లకపోవడమే బెటర్. ఈ మధ్య కాలంలో తాగుడుకు అందరు బానిసలవుతున్నారు. ఫలితంగా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు.
Also Read:Balakrishna -Sameer : జనం మధ్యలో బాలకృష్ణ తోసేశాడు.. సంచలన నిజం చెప్పిన ప్రముఖ నటుడు