జీఎస్టీ చెల్లింపుదారులకు అలర్ట్.. అమల్లోకి కొత్త నిబంధనలు..?

గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్టీ) విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కేంద్రం జీఎస్టీ నిబంధనల్లో మార్పులు చేస్తూ చిన్న వ్యాపారులకు ప్రయోజనం చేకూరేలా చేస్తోంది. 5 కోట్ల రూపాయల లోపు వార్షిక టర్నోవర్ ఉన్న వ్యాపారులు సులభంగా జీఎస్టీ దాఖలు చేసేలా నిబంధనల్లో మార్పులు చేయడానికి కేంద్రం సిద్ధమైంది. 2021 సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. Also Read: అమెజాన్ కస్టమర్లకు అలర్ట్.. […]

Written By: Navya, Updated On : December 11, 2020 11:55 am
Follow us on


గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్టీ) విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కేంద్రం జీఎస్టీ నిబంధనల్లో మార్పులు చేస్తూ చిన్న వ్యాపారులకు ప్రయోజనం చేకూరేలా చేస్తోంది. 5 కోట్ల రూపాయల లోపు వార్షిక టర్నోవర్ ఉన్న వ్యాపారులు సులభంగా జీఎస్టీ దాఖలు చేసేలా నిబంధనల్లో మార్పులు చేయడానికి కేంద్రం సిద్ధమైంది. 2021 సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి.

Also Read: అమెజాన్ కస్టమర్లకు అలర్ట్.. ఆ కాల్స్ తో తస్మాత్ జాగ్రత్త..!

ప్రస్తుతం సంవత్సరానికి 5 కోట్ల రూపాయల లోపు ఆదాయం ఉన్న వ్యాపారులు నెలకొకసారి చొప్పున 12సార్లు జీఎస్టీ రిటర్న్స్ దాఖలు చేయాల్సి వస్తోంది. అయితే ఇకపై 12సార్లు కాకుండా మూడు నెలలకు ఒకసారి చొప్పున నాలుగుసార్లు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేలా నిబంధనలలో మార్పులు రానున్నాయని సమాచారం. అయితే ఈ మేరకు కేంద్రం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటే జీఎస్టీ చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరుతుంది.

Also Read: కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరగబోతున్న స్మార్ట్ ఫోన్ల ధరలు..?

ప్రతి నెలా జీఎస్టీ రిటర్నులు దాఖలు చేయడంలో వ్యాపారులకు సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వ్యాపారులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుందని దేశంలోని కోటి మందిపై కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రభావం పడనుందని తెలుస్తోంది. దేశంలో కొత్త నిబంధనలు అమలైతే పన్ను చెల్లింపుదారులు మాత్రం 8 రిటర్న్స్ ను మాత్రమే దాఖలు చేసే అవకాశం ఉంటుంది.

మరిన్ని జాతీయం రాజకీయ వార్తల కోసం జాతీయం పాలిటిక్స్

కేంద్రం ఇన్వాయిస్ ఫైలింగ్ ఆప్షన్ ను వ్యాపారులకు అందుబాటులోకి తీసుకురానుందని.. ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ ను కూడా కేంద్రం వర్తింపజేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రెండు నెలల క్రితమే కేంద్రం జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకుందని అయితే వెంటనే ఆ నిర్ణయాలను అమలు చేయకుండా కొత్త ఏడాది నుంచి నిర్ణయాలను అమలు చేయాలని భావించిందని సమాచారం.