Health Tips: రోజురోజుకు ఆల్కహాల్ తీసుకునేవారి సంఖ్య మరింత పెరుగుతుంది. ఇక ఎంత మోతాదులో తీసుకున్నా కూడా శరీరంలో చాలా సమస్యలు వస్తుంటాయి. కొందరు తక్కువ ఆల్కహాల్ తీసుకుంటున్నాము? మోతాదుకు మించి ఆల్కహాల్ తీసుకోవడం లేదు అంటారు. మరికొందరు కేవలం బీర్ మాత్రమే తీసుకుంటున్నాము అంటారు. కానీ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయట. ఇక ఆల్కహాల్ వల్ల లివర్ సమస్యలు మరింత వస్తాయి.
అయితే కొందరు కాలేయం కోలుకున్న తర్వాత మద్యం తాగడం మొదలుపెడుతుంటారు. దీంతో కాలేయం మరింత పాడవుతుంది. కొంత సమయం తర్వాత కాలేయ సమస్యలు మరింత పెరుగుతాయి. ఇలాంటి సమస్య తర్వాత కాలేయం కోలుకునే అవకాశమే ఉండదు. ప్రస్తుతం మహిళలు కూడా మద్యం ఎక్కువగా సేవిస్తున్నారు. దీనివల్ల పురుషుల కంటే మహిళలల్లో ఈ కాలేయ సమస్య ఎక్కువ పెరుగుతుంది. మరి మద్యం సేవించడం లో టిప్స్ పాటిస్తే ఈ లివర్ సమస్యలు రావట.
రోజుకు 30 గ్రా. నుంచి 30 మి. లీ కంటే తక్కువ ఆల్కహాల్ తాగడం వల్ల కాలేయం దెబ్బతినే ప్రమాదం తక్కువ ఉంటుందట. రోజుకు 80 గ్రా. ల నుంచి 80 మి. లీ కంటే ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటే కాలేయం దెబ్బతింటుందట. అయితే వ్యక్తులు ఆల్కహాల్ తీసుకుంటే ఇది ఆహారంలో చాలా త్వరగా రక్తంలో కలిసిపోతుంది. అంతేకాదు శరీరంలో ముఖ్యమైన భాగాలకు చేరుతుంది. స్టోమాలోకి ప్రవేశించి అక్కడ నుంచి ప్రేగులోకి కడుపు చిన్న ప్రేగు భాగంలో ఎక్కువ మొత్తంలో ఈ కాలేయం చేరుతుందట.
ఆల్కహాల్ శరీరంలోకి వెళ్లిన తర్వాత రక్తంలో కలుస్తుంది. మెదడుకు కూడా ఇది చేరుతుంది. మెదడు మద్యం వల్ల ప్రభావితం అవడం వల్ల కాలేయం, కిడ్నీ, ఊపిరితిత్తులు ఒక్కొక్కటిగా ప్రభావితం అవుతాయి. తక్కువ మొత్తంలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఆకలి పెరుగుతుందట కానీ అతిగా తాగడం వల్ల ఉన్న ఆకలి కూడా చనిపోతుందట. ఇలా చాలా సమస్యలు ఉన్న ఆల్కహాల్ ను మానేయడం ఉత్తమం.