https://oktelugu.com/

Eggs : రోజుకు ఎన్ని గుడ్లు తినాలి? ఎక్కువ తింటే వచ్చే సమస్యలు ఏంటి?

అధిక కొలెస్ట్రాల్ ఉండటంతో ప్రతి ఒక్కరు భయపడతారు. అయితే ఇది అధిక రక్తపోటు స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అందుకే ఎలాంటి పదార్థాలు తినేముందు అయినా సరే ఒకసారి పూర్తిగా తినడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు. సో టేక్ కేర్.

Written By:
  • NARESH
  • , Updated On : August 10, 2024 / 11:00 PM IST

    Eggs In Summer

    Follow us on

    Eggs : ప్రతి రోజు ఉదయం ఒక ఎగ్ తినడం చాలా మందికి అలవాటు ఉంటుంది. దీని వల్ల చాలా పోషకాలు వస్తాయని, ఇది పోషకాల ఘని అని ఎక్కువ తింటారు ప్రజలు. నాన్ వెజ్ నచ్చని వారు కూడా ఎగ్ ను తినడానికి ఇష్టపడతారు. అయితే అతి సర్వత్రా వర్జయేత్ అని తెలిసిందే. గుడ్డు మంచిది అని ఎన్ని పడితే అన్ని తింటే సమస్యలు వస్తాయి. ఇక ఎగ్స్ గురించి డాక్టర్లు కూడా చెప్పడంతో చాలా మంది ప్రతిరోజూ గుడ్లు తినడం అలవాటు చేసుకున్నారు. మరి ఎక్కువ తినడం వల్ల ఏదైనా సమస్య ఉంటుందా అంటే ఉంటుందట.. మరి రోజుకు ఎన్ని గుడ్లు తినాలి? తింటే ఎలాంటి దుష్ఫలితాలు కలుగుతాయి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

    గుడ్లు ఎక్కువగా తినవద్దు అంటున్నారు నిపుణులు. అతిగా తినడం వల్ల జీర్ణాశయంలో సమస్యలు వస్తాయట. అంతేకాదు ఎక్కువగా గుడ్లు తినడం వల్ల కిడ్నీలో సమస్యలు వస్తాయట. జీర్ణ ప్రక్రియ కూడా దెబ్బతింటుంది. ఈ ఎగ్స్ దుష్ఫలితాలు పట్టించుకోకుండా తింటే మాత్రం కచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. గుడ్డులో విటమిన్ ఏ,బి12,డి,ఈ,ఒమేగా3 వంటి పోషకాలు కూడా ఎక్కువ ఉంటాయి. వీటి కోసం ప్రతి రోజు ఒక రెండు గుడ్లను తినవచ్చు. లేదంటే ఒకటి తిన్నా కూడా కొన్ని శరీరాలకు సరిపోతుంది. అంతకు మించి గుడ్లను తీసుకోవద్దు అంటున్నారు నిపుణులు.

    గుడ్లలో విటమిన్లు, ఖనిజాలు, ప్రొటీన్లు, కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి. అందుకే గుడ్లను పోషకాల నిధి గా పరిగణిస్తారు. ఆరోగ్యవంతమైన వారు ఎవరైనా సరే రోజుకు 1-2 గుడ్లు తినడం వల్ల ఎలాంటి నష్టం ఉండదట. కానీ గుడ్లు తినేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి అంటున్నారు నిపుణులు. ఒక గుడ్డులో దాదాపు 6 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది. అంతేకాదు, గుడ్డులో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, ఫోలేట్, థయామిన్ వంటి పోషకాలు ఉంటాయి. ఏ వయస్సులోనైనా ఆరోగ్యవంతమైన వ్యక్తి ప్రతిరోజూ ఒక గుడ్డు తినాలి. లేదంటే రెండు మాత్రమే. అయితే దీన్ని ఉడికించినా గుడ్ల రూపంలో లేదంటే కర్రీ రూపంలో లేదంటే ఆమ్లెట్ రూపంలో తినాలి. ఒక్కో రూపంలో ఓక్కోటి అని ఎక్కువ కూడా తినవద్దు.

    ఒక వారంలో 5-6 గుడ్ల కంటే ఎక్కువ గుడ్లు కూడా తినవద్దు. మధ్య మద్య స్కిప్ చేస్తుండాలి. ఇలా చేస్తే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉండదు. గుడ్ల వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది కాబట్టి తక్కువ తీసుకోవడం మంచిది. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నవారు మరింత జాగ్రత్త పడాలి. రోజుకు 2-3 గుడ్లు తినే వారు గుడ్డులోని పచ్చసొనను స్కిప్ చేయాలి. ఈ పచ్చసొన వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. లేదంటే గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.

    మీకు ఇప్పటికే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది. గుడ్ల వల్ల ఎలర్జీ వస్తుందట. లేదంటే శారీరక సమస్యలు కూడా పెరుగుతాయట. రెగ్యులర్ వ్యాయామం చేసేవారు ఒకటి కంటే ఎక్కువ గుడ్లు తిన్నా కూడా సమస్య ఉండదు అంటున్నారు నిపుణులు. కానీ ఎవరైనా కాస్త పచ్చసొనను స్కిప్ చేయడం బెటర్. చాలామంది గుడ్డులోని పచ్చసొనను మినహాయించి తెల్ల భాగాన్ని తినడానికి ఇష్టపడుతుంటారు. ఇందులో అధిక కొలెస్ట్రాల్ ఉండటంతో ప్రతి ఒక్కరు భయపడతారు. అయితే ఇది అధిక రక్తపోటు స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అందుకే ఎలాంటి పదార్థాలు తినేముందు అయినా సరే ఒకసారి పూర్తిగా తినడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు. సో టేక్ కేర్.