Relationship : ఈ టిప్స్ పాటించండి.. మీ పార్టనర్ తో సంతోషంగా ఉంటారు..

ఇలా చేయడం వల్ల ఇద్దరూ సంతోషంగా ఉంటారు. ఎన్నో కష్టనష్టాలు ఉంటాయి. కానీ అన్నింటిని ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోవడం బెటర్. ఏ రిలేషన్ తోడుగా ఉండదు. కానీ కష్టాల్లో పార్టనర్ కచ్చితంగా తోడుగా ఉండాలి. అప్పుడే రిలేషన్ కు అందం. సో జాగ్రత్త.

Written By: NARESH, Updated On : August 10, 2024 8:22 pm

Relationship

Follow us on

Relationship : అన్ని బంధాలకంటే భార్యభర్తల బంధం చాలా గొప్పది అంటారు. ఎలాంటి బంధంలో అయినా బ్లడ్ రిలేషన్ ఉంటుంది. కానీ ముక్కు మొహం తెలియకుండా కేవలం పెళ్లి అనే బంధంతో కలిసి మెలిసి ఉంటూ కష్టకాలంలో తోడుగా సంతోషంలో పాలు పంచుకుంటూ కలకాలం గడిపేస్తుంటారు. ఒకరి కోసం ఒకరు బతుకుతూ..ఎన్ని పరిస్థితులు ఎదురైతే ఎదురీదుతూ కలిసిఉంటారు. గొడవలు వచ్చినా సరే మళ్లీ కలిసి పోతారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఎన్నో విధాలుగా బెటర్ అని అంటారు పెద్దలు. కానీ నేటి కాలంలో మాత్రం ఈ బంధం కొన్ని సార్లు ఇబ్బందులకు గురి అవుతుంది. చిన్న చిన్న గొడవలకే విడిపోతున్నారు చాలా మంది. పెళ్లంటే నూరేళ్లు పంట అంటారు. కానీ కొందరు నూరు రోజులు కాకముందే విడిపోతున్నారు. అయితే మీ బంధం కలకాలం సంతోషంగా సాగాలంటే కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది. మరి అవేంటంటే..

క్లారిటీ: రిలేషన్‌షిప్ మొదలుపెట్టాలని డిసైడ్ అయ్యాకే రిలేషన్‌షిప్‌లోకి ఎంట్రీ ఇవ్వడం ఉత్తమం. అప్పుడే మీరు ఆ రిలేషన్‌షిప్‌లో సంతోషంగా ఉంటారు. సమయం తీసుకున్న సరే మీకు సెట్ అవుతారు అనుకున్న పార్టనర్ ను ఎంచుకోవాలి. ఎవరో ఫోర్స్ చేస్తున్నారని ఎవరో ఒకరిని చేసుకోవడం వల్ల మిగిలిన జీవితం చాలా ఇబ్బందిగా ఉంటుంది.

ఇతరుల మాటలు: ఇతరులు చెప్పిన మాటల వల్ల కాకుండా మీకు నచ్చిన క్వాలిటీస్ చూడాలి. మీ పార్టనర్ విషయంలో ఎవరో చెప్పిన క్వాలిటీస్ విని పెళ్లి చేసుకుంటే అవి మీకు కొన్ని సార్లు నచ్చకపోవచ్చు. సో మీకు నచ్చితేనే పెళ్లి చేసుకోండి. వారి గుణాలను మీరు చూసిన తర్వాత ఒకే చేయడం బెటర్. లేదంటే తర్వాత రిగ్రెట్ అవుతుంటారు.

డిపెండ్: కపుల్స్ ఒకరిపై ఒకరు ఎక్కువగా డిపెండ్ అవుతుంటారు. కొన్ని సార్లు మీ కష్టనష్టాలను మీరు చూసుకోవడం బెటర్. అన్నింటి విషయంలో మరొకరి మీద డిపెండ్ అవద్దు. కొన్ని డిపెండ్ అవ్వాలి. మరికొన్ని ఓన్ గా చేసుకోవాలి.అప్పుడే రెస్పెక్ట్ ఉంటుంది. ప్రతి విషయంలో కూడా డిపెండ్ అవడం వల్ల చులకన అవుతారు. కొన్ని సార్లు మీ డిపెండెన్సీ వల్ల పార్టనర్ కు చిరాకు కూడా వస్తుంది. అందుకే కొన్ని సార్లు డిపెండ్ అవడం కంటే మీ పని మీరు చేసుకోవడం వల్ల ఇద్దరు సంతోంగా ఉంటారు.

అర్థం చేసుకోవడం: ఎలాంటి సందర్భంలో అయినా సరే పార్టనర్‌ని అర్థం చేసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల రిలేషన్‌షిప్ స్ట్రాంగ్ అవుతుంది. ఎలాంటి సమస్య ఉన్న అడిగి అర్థం చేసుకోవాలి. కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా నిలవడమే బంధమంటే అని గుర్తు పెట్టుకోండి. సో అర్థం చేసుకోవడం మంచిది. అప్పుడు రిలేషన్ బాగుంటుంది.

కష్టాలు: ఎలాంటి కపుల్స్ మధ్య అయినా సరే ఇష్టాలు, అయిష్టాలు, కష్టాలు కామన్ గా ఉంటాయి. మీకు ఏది చేస్తే ఇష్టమో.. ఏదంటే ఇష్టం లేదో మీ పార్టనర్‌కి తెలియజేయండి. ఇలా చేయడం వల్ల ఇద్దరూ సంతోషంగా ఉంటారు. ఎన్నో కష్టనష్టాలు ఉంటాయి. కానీ అన్నింటిని ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోవడం బెటర్. ఏ రిలేషన్ తోడుగా ఉండదు. కానీ కష్టాల్లో పార్టనర్ కచ్చితంగా తోడుగా ఉండాలి. అప్పుడే రిలేషన్ కు అందం. సో జాగ్రత్త.