‘అర్జున్ రెడ్డి’ హీరో విజయ్ దేవరకొండ టాలీవుడ్లో స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్నాడు. విజయ్ దేవరకొండ సపోర్టుతో ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆనంద్ దేవరకొండ నటించిన తొలి సినిమా ‘దొరసాని’. ఈ మూవీతోనే ఆనంద్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
Also Read: కరోనాలోనూ తగ్గేది లేదంటున్న యువ హీరోలు..!
తాజాగా ఆనంద్ దేవరకొండ నటించిన రెండో సినిమా ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’. ఈ మూవీ ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఆనంద్ కు జోడీగా వర్షా బొల్లమ్మ నటించింది. ఈ మూవీకి వినోద్ అనంతోజు దర్శకత్వం వహించగా భవ్యక్రియేషన్స్ బానర్లో తెరకెక్కింది. ఓటీటీలో రిలీజైన ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది.
ఆనంద్ దేవరకొండ సినిమాలకు అతడి అన్నయ్య విజయ్ దేవరకొండ నుంచి పెద్దగా సపోర్టు లభించడం లేదు. విజయ్ టాలీవుడ్లోకి ఎలాగైతే కష్టపడి వచ్చాడో అలాగే తన తమ్ముడు కూడా ఎదగాలని విజయ్ కోరుకుంటున్నాడు. ఆ కారణంగా అతడి సినిమాల విషయంలో విజయ్ దేవరకొండ పెద్దగా కల్పించుకోవడం లేదని తెలుస్తోంది.
Also Read: ఈసారి కూడా ‘బిగ్ బాస్’ వారికి హ్యండిచ్చినట్టేనా?
ఆనంద్ తొలి సినిమా ‘దొరసాని’ విషయంలో మాత్రం విజయ్ దేవరకొండ కొంత సపోర్ట్ చేశాడు. అయితే ఆనంద్ రెండో సినిమా వచ్చిన ‘మిడిల్ క్లాస్ మెలోడిస్’ విషయంలో మాత్రం విజయ్ నుంచి పెద్దగా సపోర్ట్ లభించలేదు. అయితే తాజాగా విజయ్ దేవరకొండ ‘మిడిల్ క్లాస్ మెలోడిస్’ సినిమాపై స్పందించారు. ఈమేరకు విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో ఓ లేఖను విడుదల చేశాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ చిత్రయూనిట్ పై విజయ్ దేవరకొండ ప్రశంసలు కురిపించారు. దర్శకుడు వినోద్ అనంతోజుతోపాటు నటీనటులు కొండల్ రావు.. గోపాల్ చైతన్య.. దివ్య.. తరుణ్ భాస్కర్లను అభినందించారు. హీరోయిన్ వర్ష బొల్లమ్మ పెద్ద కళ్లేసుకొని క్యూట్‌గా నటించిందని ప్రశంసించాడు. ఇక చివరగా సినిమాలోని ‘కష్టపడు.. ఏదైనా అవసరం వస్తే కాల్ చెయ్’ అంటూ ఆనంద్ దేవరకొండకు విజయ్ మద్దతు తెలిపాడు.