https://oktelugu.com/

Fertility  : నిద్రలేమి సంతానోత్పత్తిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్లు రోజుకి 8 నుంచి 9 గంటలు పడుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. గర్భం దాల్చిన మహిళలు రాత్రిపూట ఉద్యోగం చేయకపోవడమే మంచిది. నైట్ షిఫ్ట్ పనిచేసే మహిళల్లో గర్భం దాల్చడం కష్టతరమవుతుంద. ఈ నిద్రలేమి వల్ల చాలామంది మహిళల్లో పీరియడ్స్ సమస్య ఎక్కువగా ఉంటుంది. మరికొందరు మహిళల్లో బరువు పెరగడంతో పాటు అండోత్సర్గంపై కూడా ప్రభావం చూపుతుంది.

Written By:
  • NARESH
  • , Updated On : August 11, 2024 / 03:40 PM IST
    Follow us on

    Fertility  : జీవనశైలిలో మార్పులు వల్ల ప్రస్తుతం చాలామంది లేటుగా నిద్రపోతున్నారు. సోషల్ మీడియాను ఎక్కువగా వినియోగిస్తూ లేదా నైట్ షిఫ్ట్ వల్ల కొందరిలో నిద్రలేమి సమస్య ఎక్కువగా ఉంటుంది. శరీరానికి తిండి ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. అయితే ఈ నిద్రలేమి సమస్యల వల్ల కొందరిలో సంతానోత్పత్తిపై ప్రభావం పడటంతో పాటు ఆరోగ్యం సమస్యలు వచ్చే ప్రమాదాలు ఉన్నాయట. అయితే నిద్రలేమి సంతానోత్పత్తిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఇందులో తెలుసుకుందాం.

    పురుషుల కంటే మహిళలల్లో నిద్రలేమి సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ఉద్యోగం, కుటుంబం, ఇల్లు చక్కదిద్దుకోవడంలో బిజీ అయిపోయి నిద్రపై సరిగ్గా దృష్టిపెట్టరు. దీంతో చాలామంది మహిళలు మానసికంగా ఇబ్బంది పడటంతో ఆరోగ్యంగా కూడా ఇబ్బందిపడుతున్నారు. నిద్రలేమి హార్మోన్లపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల లైంగికంగా ఆరోగ్యం దెబ్బతినడంతోపాటు రోగనిరోధకశక్తి కూడా తగ్గుతుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్లు నిద్రపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. కేవలం తినే ఆహార విషయాలతో పాటు నిద్రకు కూడా ఇంపార్ట్‌టెంట్ ఇవ్వాలి. శరీరానికి సరిపడా నిద్రపోవడం వల్ల హార్మోన్ల సమతుల్యత ఏర్పడుతుంది. అదే నిద్ర లేకపోతే శరీరంలో మంట పెరిగి హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. సరైన నిద్ర వల్ల ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్, లూటినైజింగ్ హార్మోన్, ఫొలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్లు నియంత్రిణలో ఉంటాయి. గర్భం దాల్చకపోవడానికి నిద్రలేమి కూడా ఒక ముఖ్య సమస్య. కాబట్టి టైంకి నిద్రపోవాలి. నిద్రలేమి వల్ల కొన్నిసార్లు గర్భస్రావం జరిగే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

    ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్లు రోజుకి 8 నుంచి 9 గంటలు పడుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. గర్భం దాల్చిన మహిళలు రాత్రిపూట ఉద్యోగం చేయకపోవడమే మంచిది. నైట్ షిఫ్ట్ పనిచేసే మహిళల్లో గర్భం దాల్చడం కష్టతరమవుతుంద. ఈ నిద్రలేమి వల్ల చాలామంది మహిళల్లో పీరియడ్స్ సమస్య ఎక్కువగా ఉంటుంది. మరికొందరు మహిళల్లో బరువు పెరగడంతో పాటు అండోత్సర్గంపై కూడా ప్రభావం చూపుతుంది. నిద్రపట్టకపోవడం లేక ఇంటి పని, ఆఫీస్ పని అంటూ బిజీ షెడ్యూల్ వల్ల కొందరు మహిళలు తక్కువగా నిద్రపోతారు. ఇది తప్పకుండా సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. నిద్రలేమి కేవలం మహిళల్లోనే మాత్రమే కాకుండా పురుషుల్లో కూడా సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుంది. స్మెర్మ్ కౌంట్ తగ్గుతుంది. కాబట్టి ఆడ, మగ అనే తేడా లేకుండా రోజుకి సరిపడా నిద్రపోతే ఆరోగ్యంగా ఉండటంతో పాటు యాక్టివ్‌గా కూడా ఉంటారు.