Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు అతి త్వరలోనే దర్శక ధీరుడు రాజమౌళి తో కలిసి ఒక సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. కె ఎస్ రామారావు నిర్మాతగా 12 ఏళ్ళ క్రితమే ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యింది. కానీ మహేష్ కి, రాజమౌళి కి ఉన్న కమిట్మెంట్స్ కారణంగా ఇన్నాళ్లకు ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చనుంది. ఇకపోతే ఈ సినిమా కోసం రాజమౌళి ఏమి అడిగితే అది చెయ్యడానికి మహేష్ సిద్దమైపోతున్నాడు. ఇన్నాళ్లు ఎప్పుడూ కనిపించని మేక్ ఓవర్ కోసం మహేష్ బాబు తెగ కష్టపడుతున్నాడు. ప్రతీ రోజు దానికోసం ప్రత్యేకంగా వర్కౌట్స్ చేస్తున్నాడు. అలాగే ప్రతీ రోజు అల్యూమినియం ఫ్యాక్టరీ లో నిర్వహిస్తున్న వర్క్ షాప్స్ లో కూడా మహేష్ బాబు పాల్గొంటూ సినిమా కోసం తయారు అవుతున్నాడు.
ఇది ఇలా ఉండగా రీసెంట్ గా మహేష్ కి సంబంధించిన లేటెస్ట్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారింది. గుబురు గెడ్డం తో, పోనీ టైల్ వేసుకొని, కళ్ళకు అద్దాలు పెట్టుకొని ఎంతో స్టైలిష్ గా కనిపించాడు. ఇది జస్ట్ వర్క్ షాప్ కోసం చేస్తున్న ట్రైల్స్ మాత్రమే. అధికారికంగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన తర్వాత ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారని టాక్. ఈ చిత్రాన్ని రాజమౌళి పూర్తి స్థాయిలో హాలీవుడ్ స్టాండర్డ్స్ తో తెరకెక్కించబోతున్నాడు. ఇలాంటి జానర్ లో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా మన ఇండియా లో రాలేదు. #RRR చిత్రం తో హాలీవుడ్ మార్కెట్ లోకి కూడా అడుగుపెట్టిన రాజమౌళి, ఈ సినిమా తో హాలీవుడ్ రికార్డ్స్ నే టార్గెట్ గా పెట్టుకొని చేయబోతున్నాడట. మహేష్ లుక్స్ హాలీవుడ్ లెవెల్ లోనే ఉంటుంది కాబట్టి, క్లిక్ అయితే ఆయన రేంజ్ ఎవ్వరూ కలలో కూడా ఊహించని విధంగా ఉంటుంది. ఇన్నాళ్లు రాజమౌళి కాంబినేషన్ కోసం ఎదురు చూసిన అభిమానుల ఆకలికి తగ్గ ప్రాజెక్ట్ గా ఈ చిత్రాన్ని మలిచేందుకు రాజమౌళి అన్నీ విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి అయ్యింది.
ఈ ఏడాది చివర్లో షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. తన ప్రతీ సినిమా ప్రారంభానికి ముందు ప్రెస్ మీట్ పెట్టి స్టోరీ లైన్ ని తెలియచేసే రాజమౌళి, ఈ సినిమాకి కూడా అదే పద్దతిని అనుసరించబోతున్నాడు. ఈ చిత్రం లో మలయాళం స్టార్ హీరో పృథ్వీ రాజ్ విలన్ గా నటించబోతున్నాడని టాక్. అలాగే ప్రతీ ఇండస్ట్రీ నుండి ఒక సూపర్ స్టార్ ఈ చిత్రం లో అతిథి పాత్రలు చేసే అవకాశం ఉందట. ఈ సినిమాకి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. వాస్తవానికి ఈ ఏడాది మహేష్ పుట్టిన రోజున ఈ చిత్రాన్ని ప్రారంభించాలని అనుకున్నారట మేకర్స్. కానీ డైలాగ్ వెర్షన్ స్క్రిప్ట్ ఇంకా పూర్తి కాకపోవడం తో ప్రస్తుతానికి నిలిపారట.