Dont Buy Saturday : మనకు శని దోషం ఉంటే జీవితంలో ఏది కలిసి రాదు. దీంతో శనీశ్వరుడిని కొలవడం సహజం. మనకు మంచి జరగాలని శనిదేవుడిని వేడుకుంటాం. శని చూపు మన మీద లేకపోతే అరిష్టాలు వస్తాయి. అందుకే శనీశ్వరుడిని కొలిచి ప్రసన్నం చేసుకోవడం ఆనవాయితీ. శని దేవుడిని కొలిచేందుకు శనివారం కేటాయిస్తారు. ప్రతి ఒక్క దేవుడికి ఒక్కోవారం కేటాయించారు. అలా శనీశ్వరుడికి శనివారం కొలుస్తుంటారు.
శనీశ్వరుడికి జంతువులంటే ఇష్టం. అందుకే జంతువులతో వైరం పెట్టుకుంటే శనీశ్వరుడికి కోపం వస్తుందని చెబుతారు. వాటితో మచ్చిక చేసుకుంటేనే మనకు శని ప్రభావం ఉంటుంది. లేదంటే శని చూపు మనపై పడకుండా పోతుంది. అకారణంగా మనుషులతో కూడా గొడవలు పెట్టుకోకూడదు. కుక్కలు, మేకలు, ఆవులు ఏ జంతువుకైనా ఆహారం పెట్టడం వల్ల శని కటాక్షం మనపై ఉంటుందని చెబుతుంటారు.
శనివారం ఎట్టిపరిస్థితుల్లో జుట్టు, గోళ్లు కత్తిరించుకోవద్దు. దీని వల్ల మనకు అరిష్టాలు వస్తాయి. ఇలా చేస్తే శనికి కోపం వస్తుందట. శనివారం మద్యం, మాంసం తీసుకోవద్దు. ఒకవేళ తీసుకున్నట్లయితే ఇబ్బందులు ఎదురవుతాయి. శనివారం నాన్ వెజ్ తింటే నెగెటివ్ ఎనర్జీ మనల్ని కష్టాలకు గురిచేస్తుంది. శనివారం ఉత్తర, తూర్పు, ఈశాన్య దిశల్లో ప్రయాణించవద్దని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
శనివారం పొరపాటున కూడా ఇనుము, దానికి సంబంధించిన వస్తువులు ఇంట్లోకి తీసుకురావద్దు. ఇలాంటి వాటిని ఇంట్లోకి తేవడం వల్ల అశుభం కలుగుతుంది. ఇలా శనివారం నాడు పాటించాల్సిన పరిహారాలు చేయాలి. లేకపోతే మనకు శనిదోషం పడుతుంది. ఈ నేపథ్యంలో మన ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ రాకుండా ఉండాలంటే శనీశ్వరుడిని పూజించడమే శ్రేయస్కరం.