హైదరాబాద్ నగరంలో విజృంభిస్తున్న డెంగీ.. లక్షణాలు ఇవే..?

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు అంతకంతకూ తగ్గుతున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ముఖ్యంగా హైదరాబాద్ లో డెంగీ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. చాపకింద నీరులా డెంగీ వ్యాప్తి చెందుతుండటంతో ప్రజలు డెంగీ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. చాలామంది జ్వరం వస్తే సాధారణ జ్వరం అని నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రాణాలకే అపాయం ఏర్పడుతోంది. ఆలస్యంగా డెంగీని గుర్తిస్తే అప్పటికే ప్లేట్ లెట్లు తగ్గిపోవడం వల్ల ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవాల్సిన […]

Written By: Kusuma Aggunna, Updated On : June 30, 2021 10:40 am
Follow us on

Aedes albopictus Mosquito. Super macro close up a Mosquito sucking human blood,

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు అంతకంతకూ తగ్గుతున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ముఖ్యంగా హైదరాబాద్ లో డెంగీ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. చాపకింద నీరులా డెంగీ వ్యాప్తి చెందుతుండటంతో ప్రజలు డెంగీ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. చాలామంది జ్వరం వస్తే సాధారణ జ్వరం అని నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రాణాలకే అపాయం ఏర్పడుతోంది.

ఆలస్యంగా డెంగీని గుర్తిస్తే అప్పటికే ప్లేట్ లెట్లు తగ్గిపోవడం వల్ల ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జ్వరం వచ్చి కరోనా నెగిటివ్ వస్తే తేలికగా తీసుకోవద్దని రక్త పరీక్షలు కూడా చేయించుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. జ్వరంతో వచ్చే ప్రతి పది మందిలో ఇద్దరిలో డెంగీ లక్షణాలు ఉన్నాయని ఇప్పటివరకు 40 కేసులను గుర్తించామని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

దోమ కాటు నుంచి తప్పించుకోవాలంటే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పూల కుండీలు, నీటి ట్యాంకులు, కూలర్లను వారానికి ఒకసారి శుభ్రపరచుకోవాలి. జ్వరం, తలనొప్పి, శరీరంపై ఎర్రటి పొక్కులు, కాళ్లు కదపలేని స్థితి, ఒళ్లునొప్పులు డెంగీ లక్షణాలుగా గుర్తించాలి. శరీరంలో 20వేల కంటే ప్లేట్ లెట్లు పడిపోతే ప్రమాదమని భావించాలి. డెంగీ వస్తే జలుబు, దగ్గు లక్షణాలు కనిపించవు.

పల్స్ రేటులో హెచ్చుతగ్గులు కనిపించడంతో పాటు బీపీ తగ్గుతుంది. జ్వరంతో పాటు కీళ్లనొప్పులు, ఒళ్లునొప్పులు ఎక్కువగా ఉంటే చికెన్ గన్యా అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అనారోగ్య సమస్యలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకోవడం మంచిది.