https://oktelugu.com/

అటు అవి ఇటు ఇవి మధ్యలో సునీత !

సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెలో చాల మార్పులు వచ్చాయి. మునుపటిలా స్లోగా లేదు ఆమె. ట్రెండ్ కి తగ్గట్టు లైఫ్ ను లీడ్ చేయడం అలవాటు చేసుకుంది. ఎంతైనా ఆమె రెండో భర్త ఒక పెద్ద డిజిటల్ కంపెనీకి ఓనర్ కదా. అందుకే డిజిటల్ లోకి సునీత కూడా ఎంటర్ కాబోతుంది. రీసెంట్ గా సునీత భర్త రామ్ కంపెనీ చిన్న చిన్న చిత్రాలను నిర్మించే పనిలో పడింది. పైగా ఆ చిన్న […]

Written By:
  • admin
  • , Updated On : June 30, 2021 / 10:43 AM IST
    Follow us on

    సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెలో చాల మార్పులు వచ్చాయి. మునుపటిలా స్లోగా లేదు ఆమె. ట్రెండ్ కి తగ్గట్టు లైఫ్ ను లీడ్ చేయడం అలవాటు చేసుకుంది. ఎంతైనా ఆమె రెండో భర్త ఒక పెద్ద డిజిటల్ కంపెనీకి ఓనర్ కదా. అందుకే డిజిటల్ లోకి సునీత కూడా ఎంటర్ కాబోతుంది. రీసెంట్ గా సునీత భర్త రామ్ కంపెనీ చిన్న చిన్న చిత్రాలను నిర్మించే పనిలో పడింది.

    పైగా ఆ చిన్న చిత్రాలను ఓటీటీ కంపెనీలకు అమ్ముతూ మంచి లాభాలను గడిస్తోంది. కాబట్టి, ఇక ఈ చిన్న చిత్రాల నిర్మాణ పరంపర అనేది అలాగే కంటిన్యూ చేయాలని రామ్ నిర్ణయించుకున్నారు. అందుకే, తన కంపెనీలో నిర్మించే ఇలాంటి సినిమాలకు సునీత నిర్మాత వ్యవహరించే విధంగా రామ్ ప్లాన్ చేస్తున్నాడు. సింగర్ గా ఎంతో పాపులారిటీ సాధించిన సునీత, మరి నిర్మాతగా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

    సునీతకు బుల్లితెర పై బోలెడు అభిమానులు ఉన్నారు, అందుకే సునీత బుల్లితెర కోసం కూడా ప్రత్యేక ప్రోగ్రామ్ లను ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో లెజెండరీ సింగర్ బాలు వారసత్వాన్ని కొనసాగిస్తూ ‘పాడుతా తీయగా’ ప్రోగ్రామ్‌ ను బాలు కుమారుడు ఎస్పీ చరణ్ కొనసాగిస్తున్నాడు. కాగా ఈ ప్రోగ్రామ్ లో చరణ్ తో కలిసి సునీత కూడా వ్యాఖ్యాతగా మారనుంది.

    అలాగే సునీత కొన్ని ప్రైవేట్ ఆల్బమ్ లు కూడా ప్లాన్ చేస్తోందట. ఇక ఈ మధ్యలో ఎలాగూ సినిమా పాటలు ఉంటాయి. మొత్తానికి ఇటు టీవీ షోలు, అటు ఓటీటీ చిత్రాలు, మధ్యలో సినిమా పాటలతో సునీత ఫుల్ బిజీగా మారిపోనుంది. ఇక సునీత తన రెండో భర్తతో తీసుకున్న ఫోటోలను ఈ మధ్య రెగ్యులర్ గా సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ.. రెండో పెళ్లి తర్వాత తానూ ఎంత సంతోషంగా ఉందో ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొస్తోంది.