కరోనా మహమ్మారి విజృంభణ తరువాత ప్రజల్లో డి విటమిన్ గురించి పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో డి విటమిన్ లోపంతో బాధ పడేవాళ్లు కరోనా బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తేలింది. దీంతో కొందరు విటమిన్ డి ట్యాబ్లెట్లను వినియోగిస్తున్నారు. అయితే సహజంగా కొన్ని టిప్స్ పాటించడం ద్వారా విటమిన్ డి సమస్యను సులభంగా అధిగమించడం సాధ్యమవుతుంది.
మన శరీరానికి డి విటమిన్ అవసరం ఎంతో ఉంది. ముఖ్యంగా ఎక్కువ సమయం నీడలో ఉండే వారు డి విటమిన్ లోపంతో బాధ పడుతూ ఉంటారు. సన్ షైన్ విటమిన్ అని పిలిచే డి విటమిన్ ఎముకలు, కండరాల శక్తిని పెంపొందించడానికి కూడా సహాయపడుతుంది. మన శరీరానికి ఇమ్యూనిటీ బూస్టర్ గా కూడా ఈ విటమిన్ ఉపయోగపడుతుంది. ఎవరైతే డి విటమిన్ లోపంతో బాధ పడతారో వారిని ఇతర ఆరోగ్య సమస్యలు సైతం వేధించే అవకాశాలు ఉంటాయి.
అయితే కొన్ని ఆహార పదార్థాలను రోజూ తీసుకోవడం ద్వారా సులభంగా ఇమ్యూనిటీని పెంచుకోవడం సాధ్యమవుతుంది. మష్రూమ్ ఊతప్పం శరీరానికి కావాల్సిన విటమిన్ డి అందడంలో సహాయపడుతుంది. మామూలుగా చేసుకునే ఊతప్పంకు మష్రూమ్స్ యాడ్ చేస్తే మష్రూమ్ ఊతప్పం తయారవుతుంది. బంగాళ్లదుంపలతో చేసిన కట్లెట్, ఫిష్ తీసుకున్నా శరీరానికి కావాల్సిన డి విటమిన్ లభిస్తుంది.
మనం బ్రేక్ ఫాస్ట్ గా ఎక్కువగా ఇష్టపడే వాటిలో పరాఠా కూడా ఒకటి. పరాఠాకు ఎగ్ జోడిస్తే శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్, విటమిన్స్ సులభంగా లభిస్తాయి. శరీరంలో డి విటమిన్ స్థాయి పెంచడంలో పన్నీర్ సహాయపడుతుంది. పన్నీర్ తో చేసిన ఏ ఆహారమైనా శరీరానికి మేలు చేస్తుంది. సులభంగా జీర్ణమయ్యే ఓట్స్ ఇడ్లీ ద్వారా కూడా శరీరానికి కావాల్సిన డి విటమిన్ లభ్యమవుతుంది.