https://oktelugu.com/

ఫ్యాన్‌ గాలికి చిక్కనున్న ‘గంటా’..! విశాఖలో టీడీపీ పని అయిపోయినట్లేనా..?

ఆంధ్రలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ తన మార్క్‌ రాజకీయాన్ని కొనసాగిస్తూనే ఉంది. బద్ధశత్రువైన టీడీపీని ప్రతిపక్షంగానే కాకుండా నామారూపాల్లేకుండా చేయాలని జగన్‌ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎన్నికలకు ముందే టీడీపీలోని గెలుపు గుర్రాలను లాగిన జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ‘దేశం’ నాయకులను ఏదో రకంగా చేర్చుకుంటున్నారనేది వాస్తవం. అయితే టీడీపీ నాయకులు వస్తానంటే వెంటనే రానియ్యకుండా వారంతట వారే పార్టీని వీడే ప్లాన్‌ చేస్తోంది వైసీపీ. తాజాగా విశాఖ జిల్లాలోని గంటా శ్రీనివాసరావు ‘ఫ్యాన్‌’ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 9, 2020 2:43 pm
    Follow us on

    ఆంధ్రలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ తన మార్క్‌ రాజకీయాన్ని కొనసాగిస్తూనే ఉంది. బద్ధశత్రువైన టీడీపీని ప్రతిపక్షంగానే కాకుండా నామారూపాల్లేకుండా చేయాలని జగన్‌ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎన్నికలకు ముందే టీడీపీలోని గెలుపు గుర్రాలను లాగిన జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ‘దేశం’ నాయకులను ఏదో రకంగా చేర్చుకుంటున్నారనేది వాస్తవం. అయితే టీడీపీ నాయకులు వస్తానంటే వెంటనే రానియ్యకుండా వారంతట వారే పార్టీని వీడే ప్లాన్‌ చేస్తోంది వైసీపీ. తాజాగా విశాఖ జిల్లాలోని గంటా శ్రీనివాసరావు ‘ఫ్యాన్‌’ గాలికి చిక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ‘గంటా’తో టీడీపీకి బలమున్న విశాఖలో ఆయన వైసీపీలో చేరితో ఇక సైకిల్‌కు క్యాడర్‌ లేనట్లేనేనా అంటూ చర్చించుకుంటున్నారు.

    Also Read: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్

    గంటా శ్రీనివాసరావు గత ఎన్నికల్లో ఓటమి చెందారు. ఆ తరువాత ఆయన టీడీపీలో ఉన్నారా..? లేక వైసీపీకి మద్దతు ఇస్తున్నారా..? అన్న సందేహాలు వచ్చినప్పుడల్లా తాను టీడీపీ భక్తుడేనని చెప్పుకొచ్చారు. ఎన్నోసార్లు ఎందరో టీడీపీపై విమర్శలు చేస్తే మాత్రం స్పందించలేదు. దీంతో గంటా అనుచరుల్లోనూ ఆందోళన మొదలైంది. అయితే పైకి టీడీపీ నాయకుడినేననంటూ లోలోపల మాత్రం వైసీపీ సీటెక్కడానికి యత్నిస్తున్నట్లు వార్తలొచ్చాయి.

    తాజాగా గంట శ్రీనివాసరావు వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలున్నాయన్న వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. తెర వెనుక జరిగిన కథలో భాగంగా.. ఆయన వైసీపీలోకి వెళ్తామని ఎంతో ప్రయత్నించారట. ఆ పార్టీలోని సజ్జల రామక్రిష్ణారెడ్డి చేర్చుకునేందుకు ఎంతో ప్రయత్నించారట. కానీ జగన్‌ ఇందుకు ఒప్పులేనట్లు సమాచారం. విజయ్‌సాయిరెడ్డి ఎంట్రీ ఇచ్చి గంటాను చేర్చుకునేందుకు జగన్‌ను ఒప్పించినట్లు సమాచారం. దీంతో గంటా శ్రీనివాసరావు సైకిల్‌ దిగనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు గంటా శ్రీనివాసరావు మొదట్లో విజయ్‌సాయిరెడ్డిపై ఫైర్‌ అయ్యారు. కానీ ఆ తరువాత వైసీపీలోకి వెళ్లేందుకు విజయ్‌సాయిరెడ్డిని ప్రసన్నం చేసుకుని వైసీపీకి జాయిన్‌ అవుతున్నట్లు సమాచారం.

    Also Read: జగన్‌ నిర్ణయం.. ఏపీకి నష్టం.. తెలంగాణకు ఆదాయం..!

    ప్రస్తుతం విశాఖ జిల్లాలో గంటా శ్రీనివాసరావుతో టీడీపీకి బలం ఉండేది. ఇప్పుడు ఆయన వైసీపీలోకి చేరితే టీడీపికి ఇక క్యాడర్‌ పూర్తిగా పడిపోయే అవకాశం ఉందని వైసీపీ నేతలు అంటున్నారు. టీడీపీకి చెందిన అవంతి శ్రీనివాసరావు ఎన్నికలకు ముందే వైసీపీలో చేరి మంత్రి పదవి దక్కించుకున్నారు. మరి గంటా శ్రీనివాసరావు ఎలాంటి పదవి చేజిక్కించుకుంటాడో చూడాలి మరి..