
మానవాళి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్న కరోనా మహమ్మారి గురించి రోజురోజుకు షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఏ వైరస్ వ్యాప్తి చెందని స్థాయిలో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. వైరస్ పేరు వింటేనే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు పలువురు శాస్త్రవేత్తలు కరోనా వ్యాక్సిన్ వచ్చినా వైరస్ లో చోటు చేసుకుంటున్న మార్పుల వల్ల వ్యాక్సిన్ పని చేయకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.
అయితే తాజాగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వెలుగులోకి వచ్చాయి. యార్క్ యూనివర్సిటీ నిపుణులు కరోనా వైరస్ లోని ఉత్పరివర్తనాల వల్ల వ్యాక్సిన్ తయారీలో ఎటువంటి ఇబ్బందులు ఏర్పడవని అభిప్రాయం వ్యక్తం చేశారు. సైంటిఫిక్ జర్నల్ నేచర్ లో ఈ అధ్యయనానికి సంబంధించిన ఫలితాలు ప్రచురితమయ్యాయి. శాస్త్రవేత్తలు కరోనా వైరస్ యొక్క డి స్ట్రెయిన్ ను దృష్టిలో పెట్టుకుని వ్యాక్సిన్ ను తయారు చేశారని సాధారణ క్రమం దృష్టిలో పెట్టుకుని పరిశోధనలు చేయగా ప్రస్తుతం అది జి స్ట్రెయిన్ గా మారిందని చెప్పారు.
ప్రస్తుతం విజృంభిస్తున్న కరోనా వైరస్ లో 85 శాతం వరకు మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని నేషనల్ సైన్స్ ఏజెన్సీ కామన్‌వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ శాస్త్రవేత్తలు కూడా ఇవే విషయాలను వెల్లడించారు. కొన్ని రోజుల నుంచి కరోనా వైరస్ పై ఉండే స్పైక్ ప్రోటీన్ లోని జి స్ట్రెయిన్ వ్యాక్సిన్ పై ప్రభావం చూపే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.
అయితే అధ్యయనాలు వైరస్ లో ఎన్ని మార్పులు చోటు చేసుకున్నా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ఎలాంటి ప్రమాదం ఉండదని వెల్లడిస్తున్నారు. యార్క్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎస్ఎస్ వాసన్ వైరస్ లో మార్పులు చోటు చేసుకున్నా వ్యాక్సిన్ ప్రభావవంతంగా పని చేస్తుందని.. ప్రపంచవ్యాప్తంగా ప్రయోగ దశలో ఉన్న వ్యాక్సిన్లకు ఈ వార్త శుభవార్తేనని వెల్లడించారు. మరోవైపు ఈ సంవత్సరం చివరిఉనాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.