Healthy Tips: మనలో చాలామంది పండ్లు, కూరగాయలను నిల్వ చేయడానికి ఫ్రిజ్ ను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే చాలా సందర్భాల్లో ఫ్రిజ్ లో నిల్వ చేసిన పదార్థాల వల్ల ఆరోగ్యం దెబ్బ తినే అవకాశాలు కూడా ఉంటాయి. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఫ్రిజ్ లో నిల్వ చేసిన కూరగాయలు, పండ్లు కృత్రిమంగా కూల్ కావడం వల్ల శరీరం వేడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
కొంతమంది పండ్లు, కూరగాయలతో పాటు ఇతర ఆహార పదార్థాలను సైతం ఫ్రిజ్ లో ఉంచుకుంటున్నారు. ఫ్రిజ్ లో పండ్లు ఉంచడం వల్ల వాటి ద్వారా మనకు పూర్తిస్థాయిలో పోషకాలు అందే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పండ్లను ఫ్రిజ్ లో ఉంచడాన్ని పూర్తిగా మానుకుంటే మంచిదని చెప్పవచ్చు. పుచ్చకాయను ఫ్రిజ్ లో ఉంచితే అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చెడిపోయే అవకాశం అయితే ఉంటుంది.
యాపిల్స్, ఆప్రికాట్స్, తర్బూజా, మరికొన్ని పండ్లను ఫ్రిజ్ లో నిల్వ చేస్తే ఇథీలీన్ వాయువు రిలీజవుతుంది. వీటి పక్కన నిల్వ చేసే పండ్లు, కాయగూరలు కూడా చెడిపోయే అవకాశాలు ఉంటాయి. నారింజ, నిమ్మకాయలు ఫ్రిజ్ లో ఉంచితే వాటిలో పోషకాలు తగ్గుతాయి. పీచెస్, రేగు పండ్లు, చెర్రీస్, యాపిల్స్ లో ఎంజైమ్ లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అరటిపండ్లను ఫ్రిజ్ లో ఉంచకుండా ఉంటే మంచిది.
మామిడిని ఫ్రిజ్ లో ఉంచడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు తగ్గే అవకాశం ఉంటుంది. లీచీ పండ్లను ఫ్రిజ్ లో అస్సలు ఉంచకూడదు. లీచీ పండ్లు ఫ్రిజ్ లో ఉంచితే లోపలినుంచి చెడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గాలి చొరబడని డబ్బాలో పుదీనా, కొత్తిమీరను ఉంచి ఫ్రిజ్ లో ఉంచితే మంచిది.