బార్ల లైసెన్స్ అక్టోబర్ నాటికి ముగుస్తుండడంతో ప్రభుత్వం పెంచిన సమయంతో నవంబర్ వరకు సమయం దొరికింది. దీంతో నవంబర్ 30 వరకు గడువు ఇవ్వడంతో అదనంగా నెల రోజులు నడుపుకునేందుకు అవకాశం దొరికింది. దీంతో కరోనా నేపథ్యంలో పోగొట్టుకున్న లాభాలను తిరిగి సంపాదించుకునే వీలుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బార్ల నిర్వహణ చేస్తున్న వారికి ప్రయోజనం చేకూరుతుంది.
మార్జిన్ శాతం 6.4 నుంచి 10 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ర్టంలో 2200కు పైగా మద్యం దుకాణాలు ఉన్నాయి. కరోనా ప్రభావంతో బార్లకు ఆదాయం తగ్గడంతో ఒక నెల లైసెన్స్ ఫీజు రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. కరోనా నేపథ్యంలో నెల రోజులు షాపులు మూతపడటంతో నష్టం జరిగినట్లు వ్యాపారులు చేసిన విన్నపాన్ని ప్రభుత్వం గుర్తించి నెల రోజుల పాటు మద్యం లైసెన్సుల గడువు పొడిగించడంపై హర్షం వ్యక్తమైంది.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బార్ల యజమానులకు మార్గం సుగమం కానుంది. ఈ నేపథ్యంలో రెండేళ్ల కాలానికి కొత్త ఎక్సైజ్ విధానం తీసుకురావడానికి సంకల్పిచించింది. లాటరీ ద్వారా కొత్తగా లైసెన్స్ లు జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.