Telangana Panchayat Raj Jobs 2021: టీఎస్ పంచాయతీరాజ్ శాఖ తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 172 జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 18వ తేదీ నుంచి ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబర్ 10 ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది. స్పోర్ట్స్ కోటాలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.
http://www.tsprrecruitment.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. మొత్తం 172 ఉద్యోగ ఖాళీలలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బాస్కెట్ బాల్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, కబడ్డీతో పాటు హాకీ, వాలీబాల్, హ్యాండ్‌బాల్ క్రీడల్లో రాణించిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.
18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు, దివ్యాంగులకు, ఎక్స్ సర్వీస్ మెన్ కు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. ఎస్టీ, బీసీ నాన్ క్రీమీలేయర్ అభ్యర్థులకు 400 రూపాయలు, జనరల్, బీసీ క్రీమీలేయర్ కేటగిరీ అభ్యర్థులు 800 రూపాయలు ఫీజుగా ఉంది. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ పరీక్ష కేంద్రాలుగా ఉన్నాయి.
https://epanchayat.telangana.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. విద్యార్హతలు, క్రీడార్హతల వివరాలు ఎంటర్ చేసి దరఖాస్తు ఫామ్ ను ప్రింట్ తీయడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.