Healthy sleep posture: ప్రతి వ్యక్తికి మంచి, పూర్తి నిద్ర పొందడం చాలా ముఖ్యం. మంచి నిద్ర శరీరాన్ని రీఛార్జ్ చేయడమే కాకుండా, కేలరీలు బర్న్ చేసి మిమ్మల్ని ఫిట్ గా ఉంచుతుంది. అందువల్ల, సరైన సమయంలో నిద్రపోవడం ఆ నిద్ర కూడా 7 నుంచి 8 గంటల పొందడం చాలా ముఖ్యం. అయితే, నిద్రకు సంబంధించిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం ఎలా నిద్రపోతామో అంటే ఏ స్థితిలో నిద్రపోతామో తెలుసుకోవడం చాలా అవసరం. సరైన స్థితిలో నిద్రపోతేనే శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. తప్పు స్థితిలో నిద్రపోవడం వల్ల శరీరంలో అనేక సమస్యలు వస్తాయి. ఇంతకీ ఏ స్థితిలో నిద్రపోవడం ఉత్తమమో తెలుసుకుందామా?
Also Read: ఇవి తింటే 10 ఏళ్లు ఎక్కువగా బతుకుతారట…
అన్నింటికంటే మొదట, మనం నిద్రపోతున్నప్పుడు ధరించే బట్టలు చాలా తేలికగా, వదులుగా ఉండాలి, ఫిట్ గా స్కిన్ టైట్ గా ఉండకూడదు. కాటన్‌తో తయారు అయితే చాలా మంచిది.
కడుపు మీద: కడుపు మీద పడుకోవడం మంచిదా కాదా అనేది కూడా తెలుసుకుందాం. అయితే దీనిని పిల్లల భంగిమ అంటారు. ఈ సమయంలో, మన ఛాతీ ఎక్కువగా విస్తరిస్తుంది. ఇది మంచి నిద్ర స్థానం, కానీ రాత్రంతా ఇలా నిద్రపోవడం మాత్రం అసలు మంచిది కాదు. ఎందుకంటే ఈ సమయంలో మన అన్ని అవయవాలపై ఒత్తిడి పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొందరు ఆహారం తిన్న తర్వాత వెంటనే పడుకుంటారు. వారికి మరింత ప్రమాదం. అంతేకాదు మొహం పిల్లో, బెడ్ షీట్ లకు తాగి ముడతలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.
కుడి లేదా ఎడమ: ఈ రెండింటిలో ఏది మంచిది అనుకుంటున్నారా? అయితే ఎడమ వైపు పడుకోవడం మంచిది. కానీ ఉదయం నిద్ర లేచిన తర్వాత తల, భుజం, చేయి మొత్తం ఈ ఎడమ పక్కన పడుకుంటే కాస్త వాటి మీద ప్రెజర్ పడుతుంది. అందుకే ఇలా కంటిన్యూగా పడుకోవద్దు. కొందరు చేయి మడిచి దానిపై తల పెట్టి పడుకుంటారు. ఇంకొందరు రెండు చేతులను మడిచి నిద్రపోతారు. ఇలా పడుకుంటే రక్తప్రసరణకు చాలా ఇబ్బంది అవుతుంది. కానీ ఎడమవైపు ఫ్రీగా తిరిగి పడుకోవడం చాలా ప్రయోజన కరం. ఈ వైపు పడుకుంటే ఫుడ్ మంచిగ సరఫరా అవుతుంది. జీర్ణం కూడా పర్ఫెక్ట్ గా అవుతుంది. అంతేకాదు ఆసిడ్ రిఫ్లెక్ట్ కూడా తగ్గుతుంది. ప్రెగ్నెంట్ వాల్లు కూడా ఈ విధంగానే పడుకోవడం చాలా మంచిది. ఇక కుడి వైపు పడుకుంటే గురక తగ్గుతుంది. కానీ ఆసిడ్ రిఫ్లెక్స్ ను పెంచే అవకాశాలు మాత్రం ఎక్కువగా ఉంటాయి.
Also Read: వారంలో ఎన్ని సార్లు ఆకుకూరలు తినాలి? ఎన్ని సార్లు కూరగాయలు తినాలి? పర్ఫెక్ట్ డైట్ ఏది?
వెల్లకిలా: కొందరు వెల్లకిలా పడుకుంటారు. ఇలా పడుకుంటే మెడ, నడుము, తల కూడా ఒకే పొజీషన్ లో ఉంటాయి. ఇది మీకు చాలా మంచి పొజీషన్. కానీ ప్రతి సారి పడుకున్న పొజీషన్ లో ఉండలేము కాబట్టి మీరు మారే దిశను పర్ఫెక్ట్ దిశగా ఉండేలా చూసుకోండి. నిద్రలో కూడా జాగ్రత్త సుమ.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.