Sandeep Reddy in Rajamouli path : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీలో భారీ సక్సెస్ ను నమోదు చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ (Sundeep Reddy Vanga)… ఇప్పటివరకు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్న వాళ్లలో సందీప్ రెడ్డి వంగా కూడా ఒకరు కావడం విశేషం. ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తూ వస్తుంది. మరి ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడు ఆయన ప్రభాస్ తో చేయబోతున్న స్పిరిట్ సినిమా విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఆయన చేస్తున్న ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేయడమే కాకుండా ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క ప్రేక్షకుడిని సైతం ఆకట్టుకునే విధంగా ఉండబోతోంది అనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక దానికోసం ప్రభాస్ ని పూర్తిగా తన కస్టడీలోకి తీసుకొచ్చుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ప్రస్తుతం ఫౌజీ (Fouji) సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్ ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం చేస్తున్న స్పిరిట్ (Spirit) సినిమా కోసం తన పూర్తి డేట్స్ ని కేటాయించే అవకాశాలైతే ఉన్నాయి. స్పిరిట్ సినిమా ఎప్పుడో స్టార్ట్ అవ్వాల్సింది.
Also Read :మన హీరోలు డ్యూయల్ రోల్ మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారా..?
అయితే ఫౌజీ సినిమాకి కొన్ని డేట్స్ స్పిరిట్ సినిమాకి మరికొన్ని డేట్స్ ఇచ్చి పార్లల్ గా ఈ రెండు సినిమాలు నడిపించాలని ప్రభాస్ అనుకున్నప్పటికి సందీప్ మాత్రం తన సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని లుక్కు మొత్తం చేంజ్ అవ్వాల్సి ఉంటుందని అందువల్లే పార్లల్ గా సినిమాలు చేయడం కుదరదని ఫౌజీ సినిమా పూర్తి అయిపోయిన తర్వాత తన సినిమా చేయమని చెప్పారట. దానికి ప్రభాస్ కూడా ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది.
ఇంతకుముందు రాజమౌళి (Rajamouli) ఎలాగైతే బాహుబలి ( Bahubali) సినిమా కోసం ప్రభాస్ ని తన కస్టడీలోకి తెచ్చుకొని మొత్తం సినిమా అయిపోయేంత వరకు ప్రభాస్ ని తన కాంపౌండ్ లోనే ఉంచుకున్నాడు. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ కూడా అలానే చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది…మరి ఆయన అనుకున్నట్టుగానే జరుగుతుందా? ప్రభాస్ పూర్తిగా సందీప్ కి సరెండర్ అవుతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…
Also Read : విశ్వంభర’ విడుదలకు లైన్ క్లియర్..పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇక నిరాశే!
ఇక ప్రభాస్ అభిమానులు అయితే సందీప్ రెడ్డివంగ తో ప్రభాస్ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆసక్తి ఎదురు చూస్తున్నారు. సందీప్ కోసం ప్రభాస్ ఏం చేసిన తప్పులేదు ఆ ఒక్క సినిమా చేస్తే చాలు అనే రేంజ్ లో అభిమానులైతే ఎదురు చూస్తున్నారు. మరి వీళ్ళ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది తద్వారా ప్రేక్షకులు ఈ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది…