MG electric SUV: ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ సెగ్మెంట్‌లో ఎంజీ మోటార్స్ చాలా ఫాస్టుగా దూసుకుపోతుంది. ఈ సెగ్మెంట్లో నంబర్-1 స్థానంలో ఉన్న టాటా మోటార్స్‌కు దగ్గరగా వచ్చి, చాలా కాలంగా నంబర్-2 స్థానాన్ని నిలుపుకుంది. ఈ సక్సెస్ లో విండ్‌సర్, కామెట్, ZS EV వంటి మోడల్స్ కీలక పాత్ర పోషించాయి. ఈ నేపథ్యంలో ఈ నెల అంటే జూలైలో కంపెనీ తమ ZS EVపై అదిరిపోయే డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పై ఈ నెలలో రూ.1.29 లక్షల వరకు తగ్గింపు లభిస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.17.99 లక్షల నుండి రూ.20.50 లక్షల వరకు ఉంది. వేరియంట్‌ల వారీగా డిస్కౌంట్ల గురించి తెలుసుకుందాం.
ఎంజీ ZS EV ఎగ్జిక్యూటివ్ వేరియంట్‌పై వినియోగదారులకు ఈ జూలై నెలలో భారీ తగ్గింపు లభిస్తోంది. ఇందులో భాగంగా, రూ.94,000 క్యాష్ డిస్కౌంట్, రూ.20,000 లాయల్టీ బెనిఫిట్, రూ.15,000 కార్పొరేట్ డిస్కౌంట్ కలపి మొత్తం రూ.1,29,000 వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. ZS EV ఇతర వేరియంట్‌లపై కూడా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ మోడల్స్‌పై రూ.20,000 లాయల్టీ బెనిఫిట్, రూ.15,000 కార్పొరేట్ డిస్కౌంట్ కలిపి మొత్తం రూ.35,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్లు జూలై 2025 నెలకు మాత్రమే వర్తిస్తాయి.
Also Read: టాటా కర్వ్ లాంటి SUV ఇప్పుడు 2.8 లక్షల వరకు తక్కువ ధరకే.. ఈ ఆఫర్ మిస్ అవ్వొద్దు!
ఎంజీ మోటార్స్ ఈ ఎలక్ట్రిక్ కార్‌లో 50.3kWh కెపాసిటీ గల లిథియం అయాన్ బ్యాటరీని అమర్చింది, ఇది DC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఈ ఎలక్ట్రిక్ కారును 461కిమీ దూరం వరకు నడపవచ్చు. ఈ ఎస్‌యూవీ ఇంటీరియర్‌లో 75కు పైగా కనెక్టెడ్ ఫీచర్లు, 7-అంగుళాల కంప్లీట్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 100కు పైగా వాయిస్ రికగ్నిషన్ కమాండ్‌లు ఉన్నాయి. వాయిస్ కమాండ్స్ ద్వారా ఏసీ, సన్‌రూఫ్, నావిగేషన్, మ్యూజిక్‌ను కంట్రోల్ చేయవచ్చు.
ఈ ఎలక్ట్రిక్ కార్‌లో ADAS 2 తో పాటు ట్రాఫిక్ జామ్ అసిస్ట్, స్పీడ్ అసిస్ట్ సిస్టమ్, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, లేన్ ఫంక్షన్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా, హిల్ డిసెంట్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరాతో పాటు రియర్ పార్కింగ్ సెన్సార్లు, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. అంటే, ఈ సెగ్మెంట్‌లో ఇది అత్యంత సేఫెస్ట్ ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా నిలుస్తుంది.
The New MG ZS EV has been revealed. Our top selling #EV gets up to 273-mile range and a fresh new look. Like more? Get more on https://t.co/otJznhFOzq #MGCars #MGZSEV #ElectricCars pic.twitter.com/mlPzpw4RtI
— MG Motor UK (@MGmotor) October 7, 2021