Aloe Vera Side Effects: ఈ మధ్య కాలంలో కలబందతో తయారైన ఉత్పత్తుల వాడకం అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. కలబంద అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడంలో ఎంతగానో సహాయపడుతుంది. అయితే దీర్ఘకాలంలో కలబందను తీసుకుంటే మాత్రం అనేక ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయి. తరచూ కలబందను తీసుకునే వాళ్లను విరేచనాల సమస్య వేధించే అవకాశాలు ఉంటాయి.
సాధారణంగా కలబందలో ఆంత్రాక్వినోన్ అనే ద్రవం ఉంటుంది. ఈ ద్రవం అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. కలబంద రసంను ఎక్కువగా తీసుకునే వాళ్లు బలహీనంగా మారే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కలబంద రసం తరచూ తీసుకునే వాళ్లలో పొటాషియం తగ్గుతుంది. కలబందను ఎక్కువగా తీసుకోవడం వల్ల అలసట, వికారం లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి.
Also Read: పురుషులు ఎక్కువకాలం ఒంటరిజీవితం గడిపితే కలిగే సమస్యలు ఇవే!
డీ హైడ్రేషన్ సమస్యతో బాధ పడేవాళ్లు సైతం కలబందకు దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు. దురద, చర్మం ఎర్రగా కావడం, దద్దుర్లు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే కూడా కలబంద రసానికి దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు. కలబందను తరచూ తీసుకునే వాళ్లు వైద్యుల సలహాలు, సూచనలను పాటించాలి. మితిమీరి కలబందను తీసుకుంటే ఇబ్బందులు తప్పవు.
సాధారణంగా కలబంద ముఖ సౌందర్యంను పెంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. కలబంద తీసుకోవడం ద్వారా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయి. కలబంద తీసుకోవడం ద్వారా చర్మం, జుట్టు సంబంధిత సమస్యలు కూడా తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. ఖాళీ కడుపుతో కలబంద రసాన్ని తీసుకునే వాళ్లు తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
Also Read: తినడానికి చేదుగా ఉన్నా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహార పదార్థాలివే!