https://oktelugu.com/

Karthika Deepam January 29 Episode: చావుబతుకుల మధ్య పోరాడుతున్న సౌర్య.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న హిమ!

Karthika Deepam January 29 Episode: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఎపిసోడ్ లో ఈరోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. కార్తీక్ ఎలాగైనా సౌర్య ను కాపాడుకోవాలి అని అప్పు కోసం అప్పారావు దగ్గరికి బయలుదేరుతాడు. రుద్రాణి కార్తీక్ ని తీసుకొని రమ్మనడంతో తన మనుషులు కార్తీక్ కోసం రోడ్లపై తిరుగుతుంటారు. మరోవైపు సౌర్యను చూసి దీప, హిమ బాధపడుతూ ఉంటారు. నీకు ఏమి కాదమ్మా నాన్న డాక్టర్ కదా నాన్న చూస్తాడు అని ధైర్యం ఇస్తుంది. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 29, 2022 / 09:58 AM IST
    Follow us on

    Karthika Deepam January 29 Episode: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఎపిసోడ్ లో ఈరోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. కార్తీక్ ఎలాగైనా సౌర్య ను కాపాడుకోవాలి అని అప్పు కోసం అప్పారావు దగ్గరికి బయలుదేరుతాడు. రుద్రాణి కార్తీక్ ని తీసుకొని రమ్మనడంతో తన మనుషులు కార్తీక్ కోసం రోడ్లపై తిరుగుతుంటారు. మరోవైపు సౌర్యను చూసి దీప, హిమ బాధపడుతూ ఉంటారు. నీకు ఏమి కాదమ్మా నాన్న డాక్టర్ కదా నాన్న చూస్తాడు అని ధైర్యం ఇస్తుంది.

    Karthika Deepam January 29 Episode

    డాక్టర్ బాబు డబ్బు కోసం ఎంత బాధ పడుతున్నాడో అని ఆలోచిస్తుంది. మరోవైపు హిమ చావు బతుకులో ఉన్న సౌర్య ని చూసి ఏడుస్తూ ఒకసారి నాన్నమ్మ వాళ్లకి ఫోన్ చేయమ్మ అంటూ దీపను బతిమాలుతుంది. రుద్రాణి మనుషులు కార్తీక్ ఎదురుపడి అక్క రమ్మంటుందని డిమాండ్ చేస్తూ ఉంటారు. కార్తీక్ తర్వాత వస్తాను అని.. తన పరిస్థితి బాలేదు అని అంటాడు. కానీ వాళ్లు వినిపించుకోకుండా కార్తీక్ ను బలవంతంగా లాగే ప్రయత్నం చేస్తారు. వెంటనే కార్తీక్ వారిని కొట్టి హోటల్ కు వెళ్తాడు.

    Also Read: ‘గుడ్ లక్ సఖి’ రివ్యూ

    హోటల్ లో అప్పారావు లేకపోయేసరికి బాధపడతాడు. ఇక దీప ఏం చేయలేని పరిస్థితి అని సౌర్యను చూసి బాధ పడుతుంది. మళ్లీ కార్తీక్ ను రుద్రాణి మనుషులు అడ్డుపడటంతో.. ఇక కార్తీక్ రుద్రాణి దగ్గరికే వెళ్తాడు. ఇక రుద్రాణి పై గట్టిగా అరుస్తాడు. తన కూతురికి ఆపరేషన్ చేయాలి అని అంటాడు. రుద్రాణి మాత్రం అప్పు ఇచ్చాకే ఇక్కడి నుంచి వెళ్లాలి అని అంటుంది.

    మరోవైపు అప్పారావు దీప ఇంటికి వెళ్తాడు. జరిగిందంతా ఓనర్ చెప్పాడని అంటాడు. రుద్రాణి కార్తీక్
    పరిస్థితి అర్థం చేసుకొని డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడుతుంది. తరువాయి భాగంలో సౌర్యను హాస్పిటల్ కి తీసుకొని వస్తారు. ఇక రుద్రాణి వచ్చి డబ్బులు తీసుకోమని అంటుంది. దానికి బదులుగా కూతురిని ఇవ్వమని అనడంతో కార్తీక్, దీప రుద్రాణిపై అరుస్తారు. కానీ హిమ రుద్రాణి ఇంటికి వెళ్లి మీతోనే ఉంటాను సౌర్యను కాపాడండని అడుగుతుంది. రుద్రాణి దానికి ఒప్పుకొని హిమను సంతోషంగా దగ్గరికి తీసుకుంటుంది.

    Also Read: టాలీవుడ్ ప్రజెంట్ క్రేజీ మూవీ డేట్స్ !