Railway Jobs For Btech Students: ఇండియన్ రైల్వే అనుభవం ఉన్నవాళ్లకు తీపి కబురు అందించింది. బీటెక్ చదివిన వాళ్లకు ప్రయోజనం చేకూరేలా జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ కొరకు వేర్వేరు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 14 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. ఈ ఉద్యోగ ఖాళీలలో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (ఫాబ్రికేషన్) జాబ్స్ 10 ఉండగా అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఫాబ్రికేషన్) జాబ్స్ 4 ఉన్నాయి.
45 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వాళ్లకు పనిలో అనుభవం కచ్చితంగా ఉండాలి. బీటెక్ కనీసం 55 శాతం మర్కులతో పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.
Also Read: 105 పవర్ గ్రిడ్ ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ .. భారీ వేతనంతో?
ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు ఫామ్ ను నింపి అవసరమైన డాక్యుమెంట్లను తీసుకుని ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. ఎక్స్‌క్యూటివ్ క్లబ్, కొంకణ్ రైల్ విహార్, కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్, సెక్టార్ 40, సీవుడ్స్, నావీ ముంబై, 400706 అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. 2022 సంవత్సరం ఫిబ్రవరి 7 ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది.
https://konkanrailway.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే ఛాన్స్ ఉంటుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు కూడా భారీస్థాయిలో ప్రయోజనం చేకూరనుంది.
Also Read: పదో తరగతి అర్హతతో 1501 ఉద్యోగ ఖాళీలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే?