https://oktelugu.com/

Health Tips: 80 ఏళ్లలో 20 ఏళ్లలా ఆలోచించాలంటే.. ఫాలో కావాల్సిన ట్రిక్స్ ఇవే!

కొందరికి వయస్సు పెరిగితే మైండ్ సరిగ్గా పనిచేయదు. అలా కాకుండా 80 ఏళ్లలో కూడా 20 ఏళ్లలా ఆలోచించాలంటే కొన్ని ట్రిక్స్ పాటించాలి. అవి కూడా మన జీవనశైలి మీద మాత్రమే ఆధారపడి ఉంటాయి. ఎన్ని ఏళ్లు పెరిగినా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే పాటించాల్సిన ఆ ట్రిక్స్ ఏంటో చూద్దాం.

Written By: , Updated On : January 19, 2025 / 10:07 PM IST
foods

foods

Follow us on

Health Tips: ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. శారీరకంగా, మానసికంగా (Mental Health) ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత మంచిది. కానీ ఈ రోజుల్లో చాలా మంది కొత్త జీవనశైలికి అలవాటు పడి తొందరగా అనారోగ్య సమస్యల (Health Issues) బారిన పడుతున్నారు. కేవలం శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఇబ్బంది పడుతున్నారు. రెండింట్లో ఫిట్‌గా ఉండాలంటే ఏదైనా మారాల్సిందే మన ఆలోచనలే (Thinking). కొందరికి వయస్సు పెరిగితే మైండ్ సరిగ్గా పనిచేయదు. అలా కాకుండా 80 ఏళ్లలో కూడా 20 ఏళ్లలా ఆలోచించాలంటే కొన్ని ట్రిక్స్ పాటించాలి. అవి కూడా మన జీవనశైలి మీద మాత్రమే ఆధారపడి ఉంటాయి. ఎన్ని ఏళ్లు పెరిగినా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే పాటించాల్సిన ఆ ట్రిక్స్ ఏంటో చూద్దాం.

ఇతరుల పట్ల దయ ఉండాలి
కోపానికి ఎక్కువగా గురైతే ఆలోచన శక్తి తగ్గిపోతుంది. అలాగే తొందరగా ముసలి వాళ్లు అయిపోతారట. అందుకే ఎంత కఠినమైన అయినా కూడా కోపానికి గురి కావద్దు. ఇతరుల మీద కాస్త దయతో మెలగండి. ఇతరులు మీపై ఎంత సీరియస్‌గా ఉన్నా కూడా మీరు మాత్రం కూల్‌గానే ఉండండి. ఏ విషయాన్ని కూడా గుడ్డిగా నమ్మవద్దు. కాస్త మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

వ్యాయామం
వయస్సు పెరిగిన తర్వాత మైండ్ సరిగ్గా ఆలోచించలేరు. కాబట్టి డైలీ వ్యాయామం చేయడం మరిచిపోవద్దు. డైలీ వ్యాయామం చేయడం వల్ల ఆలోచించే తీరు మారిపోతుంది. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. మీ మీద మీకు ఆత్మ విశ్వాసం కూడా పెరుగుతుంది.

చెడు అలవాట్లు మానేయండి
ఎన్ని ఏళ్లు అయినా కూడా ఉన్నతంగా జీవించాలంటే చెడు అలవాట్లు ఉండకూడదు. మద్యం, ధూమపానం, బద్ధకం వంటి చెడు అలవాట్లను వదిలేయాలి. అప్పుడే మీరు మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు. వీటి వల్ల ఆలోచించే శక్తి తొందరగా తగ్గిపోతుంది. అదే ఈ అలవాట్లు మానేస్తే మీరు 80 ఏళ్లలో కూడా 20 ఏళ్లలా ఆలోచిస్తారు.

మీకు మీరే చెప్పుకోండి
ఏవైనా తప్పులు చేస్తున్నట్లు మీకు అనిపిస్తే మాత్రం వెంటనే మీకు మీరు చెప్పుకోండి. ఇది తప్పు.. ఇలాంటి అలవాట్లు ఉండకూడదని చెప్పాలి. ఇలా మీకు మీరు చెప్పుకోవడం వల్ల శారీరకంగా, మానసికంగా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు.

పోషకాలు ఉండే ఫుడ్
చాలా మంది ఫాస్ట్‌ఫుడ్‌కి బాగా అలవాటు పడ్డారు. ఆరోగ్యంగా ఎక్కువ ఏళ్లు ఉండాలన్నా.. మెదడు బాగా పనిచేయాలన్నా కూడా పోషకాలు ఉండే ఫుడ్ తప్పనిసరి. పోషకాలు ఉండే కూరగాయలు, పండ్లు తినడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా తాజాగా ఉండే ఆకు కూరలు, బ్రోకలీ, అవకాడో వంటివి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.