mustard oil
Mustard oil: ప్రస్తుతం అన్ని చోట్ల చలి తీవ్రత (Winter) పెరిగిపోయింది. బయట వాతావరణంలోనే కాకుండా ఇంట్లో ఉన్నా కూడా చలి (Winter) ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఉష్ణోగ్రతలు కూడా చాలా తక్కువ అయ్యాయి. ఏ సమయంలో బయటకు వెళ్లిన కూడా చల్లని గాలులు వీస్తాయి. దీనివల్ల చర్మం (Skin) దెబ్బ తింటుంది. మిగతా కాలాలతో పోలిస్తే చలికాలంలో చర్మ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కేవలం చర్మం మాత్రమే కాకుండా ఆరోగ్యం (Health) కూడా దెబ్బతింటుంది. ఈ సీజన్‌లో చర్మం పొడిగా మారుతుంది. దీంతో చాలా మంది మాయిశ్చరైజర్లు, బాడీ లోషన్లు, క్రీములు వంటివి వాడుతుంటారు. అయినా కూడా చర్మం మృదువుగా (Smooth) తయారు కాదు. ప్రస్తుతం రోజుల్లో సహజంగా కంటే రసాయనాలు (Chemicals) ఉండే ప్రొడక్ట్స్‌ను (Products) ఎక్కువగా వాడుతున్నారు. చలికాలంలో చర్మం, శారీరక ఆరోగ్యం మెరుగుపడాలంటే ఆవా నూనె బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. చర్మానికి లేదా వంటల్లో ఆవాల నూనెను ఉపయోగించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చర్మం కూడా మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు. చలికాలంలో చర్మానికి ఆవాల నూనె అప్లై చేసి కాస్త మసాజ్ చేస్తే చర్మం మృదువుగా తయారు అవుతుంది. ఇవే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
బాడీకి వెచ్చగా అనిపిస్తుంది
చలికాలంలో ఆవాల నూనెను వంటల్లో ఉపయోగించడం వల్ల బాడీకి వెచ్చగా అనిపిస్తుంది. అలాగే ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. ఆవాల నూనెను చర్మానికి పట్టించి సున్నితంగా మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీనివల్ల చలికాలంలో శరీరం వేడిగా ఉంటుంది. ఎక్కువగా చలి, చేతులు, కాళ్లు తిమ్మిరి వంటి సమస్యలతో ఇబ్బంది పడతారో వారికి ఈ నూనె బాగా ఉపయోగపడుతుంది.
పెదవుల పగుళ్లు తగ్గడం
చలికాలంలో ఆవాల నూనెను పెదవులు, పాదాలకు అప్లై చేయడం వల్ల పగుళ్లు తగ్గుతాయి. కొందరికి ఈ కాలంలో రక్తస్రావం, నొప్పి ఉంటుంది. అదే ఈ నూనె రాయడం వల్ల పగిలిపోకుండా ఉంటాయి.
చర్మం నిగారింపు
చలికాలంలో చర్మం మెరవాలంటే ఆవాల నూనె బాగా సాయపడుతుంది. ఆవాలను నూనెను చర్మానికి అప్లై చేసి నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఆ తర్వాత స్నానం చేస్తే చర్మం మృదువుగా తయారు అవుతుంది. అలాగే చర్మం కూడా ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా తయారు అవుతుంది. పొడి చర్మం పూర్తిగా తగ్గుతుంది.
రోగనిరోధక శక్తి పెరుగుదల
ఈ కాలంలో ఆవాల నూనెను వంటల్లో ఉపయోగించడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులోని సెలీనియం, జింక్ చలికాలంలో జలుబు, ఫ్లూ వంటి సమస్యలు రాకుండా చేస్తాయి. అలాగే కఫం, ముక్కు దిబ్బడ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఆవాల నూనెను ఛాతీపై అప్లై చేయడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.