Health Tips for Children’s: ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని తెల్ల జుట్టు సమస్య వేధిస్తోంది. చిన్న వయస్సులోనే తెల్ల జుట్టు రావడం వల్ల పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్యను సులువుగా అధిగమించే అవకాశం అయితే ఉంటుంది. పిల్లల్లో తెల్ల జుట్టు రావడానికి ప్రధానంగా ఒత్తిడి, వారసత్వం, సరైన నిద్ర లేకపోవడం, మందులు వినియోగించడం, విటమిన్ బి లోపం, శరీరంలో మెలనిన్ ఉత్పత్తి నిలిచిపోవడం, ఇతర కారణాలు ఉంటాయి.
జుట్టు తెల్లబడకుండా ఉండాలంటే పిల్లల ఆహారంలో ఉసిరిని చేర్చాలి. ఉసిరిని ఊరగాయ లేదా చట్నీ రూపంలో అందించడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు జుట్టు తెల్లబడే అవకాశాలు తగ్గుతాయి. జుట్టు తెల్లబడటం మొదలైతే వేగంగా నియంత్రించడం ఎంతో ముఖ్యం. ఉసిరిని కొబ్బరినూనెలో వేసి ఉడికించి ఆ నూనెను పిల్లల జుట్టుకు తరచుగా మసాజ్ చేస్తే మంచిది.
ఈ విధంగా చేయడం ద్వారా పిల్లల్లో తెల్ల జుట్టు సమస్య తగ్గే అవకాశాలు ఉంటాయి. తురిమిన టమోటాను పెరుగులో కలిపి అందులో నిమ్మకాయ పిండి ఆ పేస్ట్ ను పిల్లల జుట్టుకు అప్లై చేసి 60 నిమిషాల తర్వాత కడగాలి. వారానికి రెండుసార్లు ఈ విధంగా చేస్తే తెల్లజుట్టు నల్లబడుతుంది. పొడి ఉసిరి, షికకాయిని ఐరన్ పాత్రలో రాత్రంతా నానబెట్టి దానిని రుబ్బాలి. ఆ పేస్ట్ ను ప్రతిరోజూ పిల్లల జుట్టుకు అప్లై చేసి గంట సమయం తర్వాత కడగాలి.
ఈ జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు పిల్లలకు పోషకాహారం అందేలా చూడాలి. పిల్లలు ప్రతిరోజూ పండ్లు, ఆకుకూరలు తినే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. పాలు, పెరుగు, జున్ను పిల్లల ఆహారంలో చేర్చాలి. రోజులో పిల్లలు కొంత సమయం పాటు వ్యాయామం చేసే విధంగా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.