Lemon Benefits
Health Tips : నిమ్మకాయ వంటల రుచిని భలే పెంచేస్తుంది కదా. ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరం ఈ నిమ్మకాయం. ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ వంటి అనేక ఇతర పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ముందే వచ్చింది ఎండాకాలం. రోజు ఒక గ్లాసు నిమ్మకాయ నీరు కచ్చితంగా తాగాలి అనిపిస్తుంది. ఓ పెద్ద గ్లాసులో నిమ్మకాయ పిండి అందులో కాస్త షుగర్, ఉప్పు కలిపి తాగితే భలే అనిపిస్తుంది కదా. ఎండా వేడి నుంచి ఉపశమనం లభించినట్టుగా అవుతుంది. అయితే దీన్ని ఎలాంటి అనుమానం లేకుండా ప్రతి రోజు మీ ఆహారంలో చేర్చుకోవచ్చు. దీని వల్ల ప్రయోజనాలు కూడా చాలా ఎక్కువ. అవేంటంటే?
Also Read : మిల్లేట్స్ వండేటప్పుడు ఈ మిస్టేక్స్ చేస్తున్నారా?
అలసట- బలహీనం: మీరు కష్టపడి పనిచేయకుండానే అలసిపోయినట్లు, బలహీనంగా అనిపిస్తే శరీరంలో విటమిన్-సి లోపం అని అర్థం చేసుకోవాలి. ఇక ఈ నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. శరీర శక్తిని పెంచడంలో, అలసటను తగ్గించడంలో నిమ్మకాయ చాలా సహాయపడుతుంది. ప్రతిరోజూ నిమ్మకాయ తినడం వల్ల మీ శక్తి స్థాయి పెరుగుతుంది కూడా.
జీర్ణ సమస్యలు: తరచుగా కడుపులో గ్యాస్, మలబద్ధకం లేదా అజీర్ణం వంటి సమస్యలు ఉంటే, నిమ్మకాయ తీసుకోవడం ఇవన్నింటికి చెక్ పెట్టవచ్చు. ఎందుకంటే నిమ్మకాయలో ఉండే ఆమ్లం జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. శరీరం నుంచి విష పదార్థాలను తొలగిస్తుంది. ఉదయం గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
మీ చర్మం పొడిగా, నీరసంగా లేదా మొటిమలతో నిండి ఉంటే, అది శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోతున్నాయనడానికి సంకేతం. నిమ్మకాయలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి చర్మాన్ని నిర్విషీకరణ చేయడంలో, మెరిసేలా చేయడంలో సహాయపడతాయి. ప్రతిరోజూ నిమ్మకాయ తినడం వల్ల చర్మ సమస్యలు మెరుగుపడతాయి.
వేగంగా బరువు పెరుగుతున్నారా? తగ్గడం కూడా కష్టంగా అనిపిస్తుందా? అయితే నిమ్మకాయ మీకు సహాయపడుతుంది. నిమ్మకాయలో ఉండే పెక్టిన్ ఫైబర్ ఆకలిని నియంత్రిస్తుంది. జీవక్రియను పెంచుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. తరచుగా జలుబు, దగ్గు లేదా ఇతర ఇన్ఫెక్షన్లకు గురవుతుంటే మీ రోగనిరోధక శక్తి బలహీనపడిందని సంకేతం. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. వ్యాధులతో పోరాడటానికి శరీరానికి బలాన్ని ఇస్తుంది.
నోటి నుండి దుర్వాసన: దుర్వాసన ఇబ్బందికరంగా ఉంటుంది. జీర్ణవ్యవస్థ సమస్యకు సంకేతం కూడా. నిమ్మకాయలో ఉండే ఆమ్లం నోటి బ్యాక్టీరియాను తొలగిస్తుంది. దుర్వాసనను తొలగించడంలో సహాయపడుతుంది. ఉదయం నిమ్మకాయ నీరు తాగడం వల్ల నోటి దుర్వాసన నుంచి బయట పడవచ్చు. మీకు తరచుగా కీళ్ల నొప్పులు లేదా వాపు వంటి సమస్యలు వస్తుంటే శరీరంలో యూరిక్ యాసిడ్ పేరుకుపోయింది అని సంకేతం. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ యూరిక్ యాసిడ్‌ను కరిగించడంలో సహాయపడుతుంది. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.. ట్రెండింగ్ తెలుగు వెబ్ సైట్ ఈ విషయాన్ని నిర్ధారించదు. దయచేసి గమనించగలరు.