https://oktelugu.com/

Children : పిల్లలు సంస్కారవంతులు కావాలంటే 12 సంవత్సరాల లోపు ఇవి నేర్పించాలి

Children : ఎవరి పిల్లలు కూడా ఒక్క రోజులో సంస్కారవంతులుగా మారే అవకాశం ఉండదు. మీ పిల్లలను సంస్కారవంతులుగా మార్చాలనుకుంటే, మీరు వారికి చిన్నతనం నుంచే మంచి అలవాట్లను నేర్పించడం చాలా అవసరం.

Written By: , Updated On : March 18, 2025 / 09:25 PM IST
Children cultured

Children cultured

Follow us on

Children : తమ పిల్లలు సంస్కారవంతులుగా ఎదగాలని ప్రతి తల్లిదండ్రుల కోరుకుంటారు. వారు బాగుండాలని, వారి మెంటాలిటీ బాగుండాలని, వారి లైఫ్ స్టైల్ బాగుండాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ పిల్లలను సంస్కారవంతులుగా మార్చడానికి, తల్లిదండ్రులు వారి బాల్యంలోనే చాలా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎవరి పిల్లలు కూడా ఒక్క రోజులో సంస్కారవంతులుగా మారే అవకాశం ఉండదు. మీ పిల్లలను సంస్కారవంతులుగా మార్చాలనుకుంటే, మీరు వారికి చిన్నతనం నుంచే మంచి అలవాట్లను నేర్పించడం చాలా అవసరం.

Also Read : బ్యాంక్ అకౌంట్స్ ఉన్న ఉద్యోగులకు హెచ్చరిక

ఎందుకంటే మీరు బాల్యంలో పిల్లలకు మంచి విలువలను నేర్పిస్తే ఈ విలువలు చివరి వరకు వారితోనే ఉంటాయి. అందుకే పిల్లలలో చిన్నప్పటి నుండే మంచి విలువలను పెంపొందించడానికి ప్రయత్నించాలి. తద్వారా వారు సమాజంలో మీ పేరును నిలబెట్టేలా ఉంటారు. మంచి పేరు రాకపోయినా పర్వాలేదు కానీ చెడు పేరు రాకుండా ఉంటారు. అయితే పిల్లలకు బాల్యంలోనే నేర్పించాల్సిన 4 అలవాట్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పిల్లలకు సమయపాలన అలవాటు నేర్పించాలి. సమయాన్ని సరిగ్గా ఎలా ఉపయోగించాలి? సమయానికి పనిని ఎలా పూర్తి చేయాలి? వంటి విషయాలు వారికి నేర్పించాలి. సమయపాలన నేర్పించని పిల్లలు జీవితంలో విజయం సాధించలేరు. కాబట్టి, పిల్లలకు సమయపాలన నేర్పించడం చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు.

పరిశుభ్రత: మీరు పిల్లలకు పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరించాలి. ఇందులో విజయవంతమైతే, పిల్లలు పెద్దయ్యే వరకు పరిశుభ్రత విషయంలో జాగ్రత్తగా ఉంటారు. ఈ విషయంలో మిగతా వారి కంటే భిన్నంగా చేస్తుంది. పిల్లలకు పరిశుభ్రత అలవాటు నేర్పించాలి. తమ చుట్టూ ఉన్న వాతావరణాన్ని శుభ్రంగా, చక్కగా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో వారికి నేర్పించాలి.

3. గౌరవం – క్రమశిక్షణ: వయసును బట్టి పెద్దలను గౌరవించే పిల్లలు చాలా మంచి పేరు సంపాదిస్తారు. అలాంటి పిల్లలు జీవితంలో చాలా పురోగతి సాధిస్తారు. అప్పుడు గౌరవం పొందడానికి అతిపెద్ద మంత్రం ఏంటి అనుకుంటున్నారా? ఇతరులను గౌరవించాలి. పిల్లలకు గౌరవం, క్రమశిక్షణ అలవాట్లను నేర్పించాలి. పెద్దలను గౌరవించడం, క్రమశిక్షణతో ఉండటం ఎంత ముఖ్యమో వారికి నేర్పించాలి.

4. సహకారం – సానుభూతి: పిల్లలకు సహకారం, సానుభూతి అలవాట్లను నేర్పించాలి. ఇతరులకు సహాయం చేయడం, వారి భావాలను గౌరవించడం ఎంత ముఖ్యమో వారికి నేర్పించాలి. కష్ట సమయాల్లో ఎవరికైనా ఎలా సహాయం చేయాలో పిల్లలకు నేర్పండి. కష్టాల్లో ఉన్న ప్రజలకు ఎలా సహాయం చేస్తారు. ఎలా సానుభూతి చూపుతారు అనే విషయాల పట్ల మంచి అవగాహన ఉండాలి.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.. ట్రెండింగ్ తెలుగు వెబ్ సైట్ ఈ విషయాన్ని నిర్ధారించదు. దయచేసి గమనించగలరు.

Also Read : ఎండలో వెళ్తున్నారా..? ఈ దుస్తులు వేసుకుంటే డేంజర్? మరి ఎలాంటివి ధరించాలి?