Fridge Place in House
Vasthu Tips : ఇప్పుడు రోజుల్లో అందరి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది. అయితే ఇంట్లో ఉన్న ఖాళీ టైమ్ బట్టి ఫ్రిడ్జ్‌ను ఉంచుకుంటారు. ఎక్కువ శాతం మంది వంట గదికి సమీపంలోనే ఫ్రిడ్జ్‌ను ఉంచుతారు. అయితే ఇంట్లో ఫ్రిడ్జ్ పెట్టే విషయంలో తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. సరైన ప్లేస్‌లో ఫ్రిడ్జ్‌ను పెట్టుకోకపోవడం వల్ల ఇంట్లో కొన్ని సమస్యలు వస్తాయని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ఫ్రిడ్జ్ విషయంలో కొన్ని రూల్స్ పాటించకపోతే మాత్రం తప్పకుండా ఇంట్లో ఎల్లప్పుడూ కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అలాగే గొడవలు వంటివి వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు అంటున్నారు. అయితే ఫ్రిడ్జ్ విషయంలో పాటించాల్సిన ఆ వాస్తు నియమాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
కొందరు సూర్య కిరణాలు పడే చోట ఫ్రిడ్జ్‌ను పెడతారు. ఇలా పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు. సూర్యకిరణాలు పడని చోటే ఫ్రిడ్జ్‌ను పెట్టాలి. లేకపోతే ఇంట్లో గొడవలు ఎక్కువ అవుతాయని పండితులు అంటున్నారు. కొందరు కంఫార్ట్ బట్టి ఇంట్లో ఫ్రిడ్జ్ పెడుతుంటారు. కానీ ఇంట్లో ఫ్రిడ్జ్‌ను కేవలం పడమర వైపు మాత్రమే పెట్టాలని పండితులు అంటున్నారు. ఎందుకంటే ఈ వైపు పెట్టడం వల్ల ఇంట్లో సంతోషం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఎలాంటి గొడవలు రావు. సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారని పండితులు అంటున్నారు. పడమర వైపు కుదరకపోతే కనీసం దక్షిణం వైపు అయినా పెట్టవచ్చు. కానీ తూర్పు, ఉత్తర వైపు అయితే అసలు ఫ్రిడ్జ్‌ను పెట్టకూడదు. ఇలా చేస్తే కోరుకున్న పనులు జరగవు. అన్ని రకాల సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కుటుంబంలో గొడవలు ఎక్కువగా వస్తాయి. అసలు మానసిక ప్రశాంతత ఉండదు. ఏదో ఒక సమస్య ఎప్పుడూ కూడా వెంటాడుతూనే ఉంటుంది. అదే పడమర వైపు ఉంటే మాత్రం ఇంట్లో సంతోషం ఉంటుంది. అలాగే మానసిక ప్రశాంతత ఉంటుందని నిపుణులు అంటున్నారు.
కొందరు ఇంట్లో ఫ్రిడ్జ్‌ను ఈశాన్యం వైపు పెట్టకూడదు. ఇలా పెట్టడం వల్ల సమస్యలు వస్తాయి. ఫ్రిడ్జ్‌ను ఇంట్లో నైరుతి వైపు ఉంచడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం రాదు. ఇంట్లో సంపద కూడా వృద్ధి చెందుతుంది. అలాగే ఫిడ్జ్‌ను కొందరు తలుపుకు దగ్గరగా ఉంచుతారు. ఇలా ఉంచడం వల్ల మానసిక సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. వీటితో పాటు ఆర్థిక సమస్యలు రావడం, ఇంట్లో ప్రతికూల శక్తి ఏర్పడటం వంటివి జరుగుతాయని పండితులు చెబుతున్నారు. అయితే కొందరు బిజీ షెడ్యూల్ వల్ల నెలలకు ఫ్రిడ్జ్ శుభ్రం చేస్తారు. కానీ ఇలా కాకుండా ఫ్రిడ్జ్ ఇంట్లో ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలని పండితులు అంటున్నారు. ఫ్రిడ్జ్‌లో ఎప్పుడూ కూడా పాలు లేదా నీరు పెడుతుండాలి. దీనివల్ల ఆర్థిక సమస్యలు అన్ని కూడా తీరిపోతాయి. ఇంట్లో అంతా కూడా సానుకూలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.