https://oktelugu.com/

Millets : మిల్లేట్స్ వండేటప్పుడు ఈ మిస్టేక్స్ చేస్తున్నారా?

Millets : సరైన పద్ధతిలో మాత్రమే వండి తినాలని నిపుణులు సూచిస్తున్నారు. తెలుసో తెలియక చేసిన కొన్ని తప్పుల వల్ల అనారోగ్య సమస్యల బారిన పడతారు. అయితే మిల్లేట్స్ వండేటప్పుడు చేయకూడని ఆ తప్పులేంటో ఈ స్టోరీలో చూద్దాం.

Written By: , Updated On : March 18, 2025 / 12:00 AM IST
Millets

Millets

Follow us on

Millets : ఆరోగ్యంగా ఉండటానికి చాలా మంది ఈ రోజుల్లో మిల్లేట్స్ ఎక్కువగా తింటున్నారు. వీటిలోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరిపించడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. వీటిలో పొటాషియం, మెగ్నీషియం వంటివి ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే వీటిని ఎలా వండి తినాలనే విషయం చాలా మందికి సరిగ్గా తెలియదు. దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీటిని సరైన పద్ధతిలో మాత్రమే వండి తినాలని నిపుణులు సూచిస్తున్నారు. తెలుసో తెలియక చేసిన కొన్ని తప్పుల వల్ల అనారోగ్య సమస్యల బారిన పడతారు. అయితే మిల్లేట్స్ వండేటప్పుడు చేయకూడని ఆ తప్పులేంటో ఈ స్టోరీలో చూద్దాం.

Also Read : బట్టతల, జుట్టు రాలకుండా ఉండాలంటే.. ఇవి రెగ్యులర్ గా తింటూ ఉండాలి.. అవేంటంటే?

సాధారణంగా అన్ని మిల్లేట్స్‌పై పొట్టు ఉంటుంది. దీని లోపలే బియ్యం ఉంటుంది. ఏ మిల్లేట్స్ అయినా కూడా ఫస్ట్ దాని మీద బ్రాన్ ఉంటుంది. ఆ తర్వాత ఎండోస్పెర్మ్ ఉంటుంది. దీని తర్వాత జెర్మ్ ఉంటుంది. ఇలా రాగులు, జొన్నలు, సజ్జలు, బ్రౌన్ రైస్ అన్నింటిలో కూడా ఉంటుంది. బయట మార్కెట్‌లో వీటిని కేవలం ఒక పొర మాత్రమే తీసి విక్రయిస్తారు. ఇలా రెండు పొరలతో ఉన్నవాటిని వండుకుని తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఇలాంటి బియ్యంలో ఎక్కువగా చక్కెర ఉంటుంది. దీన్ని తింటే మీకు మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి పైన ఉన్న బ్రాన్‌ను తీసేయడం వల్ల అవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. బ్రాన్ లేని ధాన్యాన్ని మీరు తీసుకోకపోవడమే మంచిది. పూర్తిగా ధాన్యంతో ఉన్న వాటిని తీసుకోవాలి. లేదంటే పంట పొలాల్లో డైరెక్ట్‌గా కొనుగోలు చేసుకోవడం మంచిది. పంట పొలాల్లో అయితే మంచిగా ఉంటాయి. వీటిని మీరు తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావు. వీటిలోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. మార్కెట్‌లో ఎక్కువగా పాలిష్ చేసివవి దొరుకుతాయి. వీటిని తీసుకోకపోవడమే మంచిది.

కొందరు వీటిని వాష్ చేయకుండా వండుతారు. ఇలా అసలు చేయకూడదు. కనీసం ఒక్కసారైనా కడగాలి. లేకపోతే ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. ఎందుకంటే వీటిని పాలిష్ చేసి ఇస్తారు. మీరు మళ్లీ ఎక్కువ సార్లు వాష్ చేస్తే అందులోని పోషకాలు నీటి ద్వారా బయటకు పోతాయి. వీటివల్ల మీ శరీరానికి ఎలాంటి పోషకాలు అందవు. అలాగే కొందరు ఆరోగ్యానికి మంచివని ఎక్కువగా తింటారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఇలా మూడు పూటలు కూడా తింటారు. ఇలా తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీటిలో ఎక్కువగా తీసుకుంటే కొందరికి కడుపు సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకోవద్దు. కాస్త లిమిట్‌లో మాత్రమే వీటిని తీసుకోండి.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.