Health Tips: ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరానికి అవసరమైన పోషకాలు తప్పకుండా అందాలి. లేకపోతే శరీరం అనేక వ్యాధులకు (Diseases) కేరాఫ్ అడ్రస్‌గా మారుతుంది. పోషకాహార లోపం (Proteins) ఉంటే మాత్రం ఎల్లప్పుడూ కూడా అనారోగ్య సమస్యలతో (Health Issues) బాధపడుతుంటారు. ఆరోగ్యంగా ఉండరు. ఎల్లప్పుడూ కూడా నీరసం, అలసటగా కనిపిస్తారు. ఎక్కడలేని వ్యాధులన్నీ కూడా దరి చేరతాయి. చాలా మంది ఈ రోజుల్లో పోషకాలు ఉండే ఆహారం కంటే లేని వాటికే మక్కువ చూపిస్తున్నారు. బయట ఫాస్ట్ ఫుడ్ (Fast Food) ఎక్కువగా తినడం, మసాలా ఫుడ్స్‌కి (Masala Foods) అలవాటు పడ్డారు. వీటివల్ల కడుపు నిండుతుంది. కానీ ఆరోగ్యం కుదుట పడదని నిపుణులు చెబుతున్నారు. పోషకాలు లేని ఆహారం తినడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా కొన్ని రకాల పోషకాలను డైట్‌లో యాడ్ చేసుకోవాలి. పాస్తా, నూడిల్స్ వంటి ఫాస్ట్‌ఫుడ్‌కి కాస్త దూరంగా ఉండాలి. వీటిలో పోషకాలు లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే ఏ పోషకాలు తగ్గితే ఏయే అనారోగ్య సమస్యలు వస్తాయో ఈ స్టోరీలో చూద్దాం.
ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు
ఆరోగ్యానికి ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు బాగా ఉపయోగపడతాయి. ఇవి బాడీలో లేకపోతే కళ్లు పొడిగా మారడం, చర్మం మారడం, నిరాశ, అలసట, గుండె జబ్బులు, గోర్లు బలహీనపడటం, జుట్టు మార్పులు, మానసిక సమస్యలు వంటివన్నీ వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తినే ఫుడ్‌లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండేలా చూసుకోండి. ఇవి గుండె ఆరోగ్యానికి మెరుగు పడతాయి. సాల్మన్ వంటి కొవ్వు చేపలు, అవిసె గింజల్లో ఎక్కువగా ఇవి ఉంటాయి.
మెగ్నీషియం
మెగ్నీషియం లోపం ఉంటే కండరాల బలహీనత, కండరాల తిమ్మిరి, వికారం, అలసట, ఎక్కువగా హృదయ స్పందన, మలబద్ధకం, తలనొప్పి, అధిక రక్తపోటు వంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఐరన్
బాడీకి సరిపడా ఐరన్ లేకపోతే చర్మం పాలిపోయినట్లు అవుతుంది. అలాగే శ్వాస ఆడకపోవడం, ఛాతిలో నొప్పి, బలహీనత, తలనొప్పి వంటి సమస్యలు అన్ని కూడా వస్తాయి. కాబట్టి ఐరన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం అలవాటు చేసుకోవడం ఉత్తమం.
జింక్
జింక్ తక్కువ అయితే జుట్టు విపరీతంగా రాలిపోతుంది. అలాగే కంటి సమస్యలు, చర్మంలో మార్పులు, ఎక్కువగా ఇన్ఫెక్షన్లు రావడం, విరేచనాలు వంటి సమస్యలు అన్ని కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.