Maha Kumbh Mela 2025: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ( Prayagraj) మహాకుంభమేళా (Maha Kumbh Mela) జరుగుతోంది. దాదాపు 144 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ మహా కుంభమేళానికి (Maha Kumbh Mela) భారీ సంఖ్యలో నాగ సాధువులతో పాటు భక్తులు వెళ్తున్నారు. మొత్తం నాలుగు ప్రదేశాల్లో ఈ మహా కుంభమేళా జరుగుతోంది. ఈ పవిత్ర నదుల్లో అమృత స్నానం (Amrutha Snanam) చేయడానికి అఘోరాలు, నాగ సాధువులు ఎక్కువగా వెళ్తున్నారు. మొదటి అమృత స్నానం ఆచరించడానికి మహిళా నాగ సాధువులు ఎక్కువగా తరలి వచ్చారు. అయితే నాగ సాధువుల జీవనం చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. వీరు అన్ని బంధాలను వదిలేసి జీవిస్తారు. వీరికి బంధాలు, బంధుత్వాలు అంటూ ఏం ఉండవు. వీరు శివుని (Sivudu) భక్తిలో నిమగ్నమై ఉంటారు. అయితే మహిళా నాగ సాధువుల జీవనం ఇంకా కాస్త వెరైటీగా ఉంటుంది. అసలు వీరు మహిళా నాగ సాధువులుగా ఎలా మారారో తెలిస్తే.. ఇంత కష్టమా అనిపిస్తుంది. దాదాపు ఏళ్ల పాటు ఎన్నో ఆచారాలు పాటించి నాగ సాధువులుగా మారుతారు. అసలు ఎలా వీరు నాగ సాధువులుగా మారారు? మారాలంటే పాటించాల్సిన ఆచారాలు ఏంటి? ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మహిళలు నాగ సాధువులుగా మారాలంటే కొన్నేళ్ల పాటు బ్రహ్మ చర్యం పాటించాలి. కేవలం ఒక వస్త్రాన్ని మాత్రమే ధరించాలి. అంటే కుట్టకుండా ఉన్న దుస్తులను మాత్రమే ధరించలి. అలాగే నుదుటిపై తప్పనిసరిగా తిలకం పెట్టుకోవాలి. మహిళలు దాదాపుగా 10 నుంచి 15 సంవత్సరాల వరకు కఠిన బ్రహ్మచర్యం పాటించాలి. బంధాలు, బంధుత్వాలు అన్ని వదిలేయాలి. అంటే కుటుంబ సభ్యులు జీవించి ఉన్నప్పుడే పిండ దానాలు అన్ని చేయాలి. అసలు బంధాల గురించి ఆలోచించకూడదు. పూర్తిగా ఆధ్యాత్మిక జీవితాన్ని అవలంభించాలి. పూజతో డే స్టార్ట్ అయ్యి.. పూజతోనే పూర్తి కావాలి. బ్రహ్మ ముహూర్తంలో లేచి శివుని భక్తితో పూజించాలి. రోజంతా కూడా శివుని పూజిస్తేనే వారి ఆధ్యాత్మికను గుర్తించి చివరిగా సాధువులుగా మారుతారు. మహిళా నాగ సాధువులను మాత అని, పురుషులను వస్త్రధారి, దిగంబర అని పిలుస్తుంటారు. అయితే మహిళా నాగ సాధువులు దుస్తులు ధరించాలా? వద్దా? అనేది వారి ఇష్టం. ఒకవేళ ధరించిన కూడా కేవలం కుంకుమపువ్వు రంగులో ఉండే దుస్తులను ధరించాలనే నియమం కూడా ఉంది.
మహిళా నాగ సాధువులు పీరియడ్స్ సమయంలో గంగా స్నానం ఆచరించారు. గంగా జలాన్ని కేవలం తలపై చల్లుకుంటారు. అలాగే వీరు కేవలం పండ్లు, మూలికలు తింటారు. అంటే వండని వాటిని మాత్రమే ఎక్కువగా తింటారు. ఇలా వీరు కొన్నేళ్ల పాటు ఆచారాలు పాటిస్తే చివరకు మహిళా నాగ సాధువులుగా మారుతారు. కఠినమైన వ్రతం ఆచరించడం వల్ల చివరకు మారుతారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.