Perfume: పెర్ఫ్యూమ్ (Perfume) అంటే అందరికీ ఇష్టమే. ప్రతీ ఒక్కరూ కూడా తమ శరీరం నుంచి వాసన రావాలని కోరుకుంటారు. దుర్వాసన రాకుండా ఉండటానికి కొందరు వీటిని వాడుతుంటారు. అందరిలో హుందాగా కనిపించడానికి పెర్ఫ్యూమ్ (Perfume) బాగా ఉపయోగపడుతుందని భావిస్తారు. కొందరు అయితే స్నానం చేయకుండా బాడీకి పెర్ఫ్యూమ్ (Perfume) కొడుతుంటారు. దీనివల్ల దుర్వాసన రాదని, ఇతరుల దగ్గర స్నానం చేయకపోయినా తెలియదని భావిస్తారు. ఇప్పుడు అయితే పెర్ఫ్యూమ్ ఒక ట్రెండ్ (Trend) అయిపోయింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఎన్నో రకాల పెర్ఫ్యూమ్‌లు (Perfume) ఉన్నాయి. వీటిని రసాయనాలతో తయారు చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కొందరు చర్మంపై దగ్గర ఉండి ఎక్కువగా కొట్టడం వల్ల చర్మ సమస్యలు వస్తున్నాయి. అయితే పెర్ఫ్యూమ్ ఎక్కువగా కొట్టుకోవడం వల్ల కేవలం చర్మ సమస్యలే కాకుండా ఇతర అనారోగ్య సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
శ్వాసకోశ చికాకుగా ఉండటం
ఇథనాల్, అసిటోన్, ఫార్మాల్డిహైడ్ వంటి అనేక సమ్మేళనాలను కలిపి పెర్ఫ్యూమ్ తయారు చేస్తారు. వీటిని మనం ఉపయోగించడం వల్ల శ్వాసకోశ వ్యవస్థలో సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. నిరంతరంగా దగ్గు, శ్వాసలో ఇబ్బంది, ఉబ్బసం వంటి సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఎక్కువగా పెర్ఫ్యూమ్ కొట్టుకోవద్దు. ఒకవేళ కొట్టిన బాడీకి దూరంగా ఉంచి కొట్టాలని నిపుణులు చెబుతున్నారు.
ఆస్తమా
పెర్ఫ్యూమ్‌లోని సింథటిక్ సువాసన కొంత మందికి ఆస్తమా వచ్చేలా చేస్తుంది. ఆ పెర్ఫ్యూమ్ వాసనకి క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ కూడా వస్తుంది. ఈ వ్యాధి ఉన్నవారు పెర్ఫ్యూమ్‌ను ఎక్కువగా ఉపయోగించకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఊపిరితిత్తుల ఆరోగ్యంపై ప్రభావం
పెర్ఫ్యూమ్‌లో ఉండే రసాయనాలు ఊపిరితిత్తులపై చెడు ప్రభావం చూపుతాయి. థాలేట్స్ అనే రసాయనాలు శ్వాసకోశ సమస్యలను కలిగిస్తాయి. వీటిని అధికంగా వాడితే ఈ సమస్య మరింత తీవ్రం అవుతుంది. కాబట్టి వీటిని అంతగా వాడకపోవడం బెటర్.
అలర్జీ
పెర్ఫ్యూమ్‌లోని రసాయనాలు అలర్జీకి కారణం అవుతాయి. ఎక్కువగా వీటిని వాడటం వల్ల క్రానిక్ సైనస్ ఇన్ఫ్లమేషన్ ఏర్పడుతుంది. దీని కారణంగా ఊపిరితిత్తుల పనితీరు మందగిస్తుంది. అలాగే ఇంకా అనేక సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి ఎక్కువగా పెర్ఫ్యూమ్‌ను వాడవద్దు. ఒకవేళ వాడిన బాడీ మీద ఎక్కువ సేపు కొట్టవద్దు.
నరాల బలహీనత
పెర్ఫ్యూమ్ సువాసన వల్ల కొందరికి తలనొప్పి, తల తిరగడం, వాంతులు వంటి సమస్యలు వస్తాయి. అలాగే నరాల బలహీనత కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరికి ఈ వాసన పడక మానసిక సమస్యలు కూడా వస్తాయి. ఈ వాసనకి తల తిరుగుతుంది. దీంతో మానసికంగా ఆవేదన చెందుతారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.