Health tips after Meals: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అయితే ఆరోగ్యం బాగుండడానికి కొన్ని పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉంది. పూర్వకాలంలో పెద్దలు ఆహార నియమాలు పాటించడం వల్లే ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకగలిగారు. అంతేకాకుండా వారి వారసత్వాన్ని పుచ్చుకొని కొందరు ఆరోగ్య నియమాలు పాటిస్తూ హెల్త్ ను కాపాడుకుంటున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రత్యేకంగా మెడిసిన్లు వాడాల్సిన అవసరం లేదు.. భారీగా వర్కౌట్ చేయాల్సిన పనిలేదు. కొన్ని రకాల నియమాలు పాటిస్తే ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటిలో ఆహారం తిన్న తర్వాత కొన్ని పనులు చేయకుండా ఉండాలి. ఇవి చేస్తే ఆరోగ్యం పై ప్రభావం పడి కొత్త రకాల రోగాలు వచ్చే అవకాశం ఉంది. మరి ఆహారం తిన్న తర్వాత ఏం చేయాలి?
కొంతమంది భోజనం చేసిన వెంటనే స్నానం చేయాలని అనుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల జీర్ణ క్రియ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆహారం తిన్న వెంటనే కడుపులో పదార్థాలు ఉంటాయి. ఈ సమయంలో వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల శరీరం వేడెక్కిపోతుంది. ఫలితంగా జీర్ణం అయ్యే సమయంలో సమస్యలు ఏర్పడి ఆ తర్వాత ప్రేగులో సమస్యలు వస్తాయి. అయితే భోజనం చేసిన తర్వాత స్నానం చేయాలని అనుకుంటే కనీసం రెండు గంటలపాటు వెయిట్ చేయాలి.
అన్నం తిన్న తర్వాత చాలామందికి వెంటనే నిద్ర వస్తుంది. కానీ ఇలా నిద్రపోవడం వల్ల ఆహారం అలాగే ఉండిపోతుంది. ప్రస్తుత కాలంలో చాలామంది శారీరక శ్రమ ఎక్కువ చేయడం లేదు. దీంతో వీరు తిన్న ఆహారం త్వరగా జీర్ణం కావడం లేదు. అయితే ఇలాంటి సమయంలో ఆహారం తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల అది త్వరగా జీర్ణం కాకుండా అలాగే ఉంటుంది. కనీసం 20 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి. అలా చేయడం వల్ల నిద్ర పోయినప్పుడు ఎలాంటి సమస్యలు ఉండవు.
భోజనం చేసే సమయంలో చల్లటి నీరు తాగకుండా ఉండాలి. అల్లరి నీరు తాగడం వల్ల ఆహారం త్వరగా జీర్ణం కాకుండా అలాగే ఉండిపోతుంది. గోరువెచ్చని నీరు తీసుకోవడం వల్ల కడుపుతో ఆహారం అలాగే ఉండిపోకుండా ఉంటుంది. అలాగే జీలకర్ర లేదా ధనియాల కషాయం తాగడం వల్ల కూడా త్వరగా జీర్ణం అయ్యే అవకాశం ఉంటుంది. అయితే భోజనం చేసే సమయంలో ఇది కూడా తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఆహారం కంటే ఎక్కువగా పానీయాలే తాగితే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
ఆహారం తీసుకున్న తర్వాత ఏదైనా పండు తినాలని కొందరు అనుకుంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో తిన్న వెంటనే పండ్లను తీసుకోవద్దు. ఎందుకంటే పండ్లల్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఆహారంలో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు కలయికలో ఆహారం త్వరగా జీర్ణం కాకుండా ఉంటుంది. అయితే భోజనం చేసే రెండు గంటల ముందు లేదా రెండు గంటల తర్వాత ఫ్రూట్స్ తీసుకోవచ్చు.